Chinmayi Sripaada: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ట్విషా శర్మ (33) అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అత్తవారింటి వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించారు. ఈ విషాదంపై గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా అత్యంత ఘాటుగా స్పందించారు.
‘ఆడపిల్ల అంటే రిటర్న్ పాలసీ లేని వస్తువా?’

ట్విషా శర్మ మృతిపై చిన్మయి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ సమాజంలో పెళ్లి పేరిట అమ్మాయిలను చూసే కోణాన్ని ఆమె తీవ్ర పదజాలంతో నిలదీశారు.
"ట్విషా మరణం ఒక చేదు నిజాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను అత్తవారింటికి పంపించే ఒక 'వస్తువు'లా (commodity) భావిస్తున్నారు. దానికి ఎలాంటి 'రిటర్న్ పాలసీ' ఉండదని అనుకుంటున్నారు. కన్యాదానం ముగిసిన తర్వాత ఆ అమ్మాయి అత్తవారింట్లోనే ప్రాణాలు విడిచినా పర్వాలేదు.. అదే తమకు గౌరవం అని భావిస్తున్నారు.. అంతేనా?" అని చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగింది?
నోయిడాకు చెందిన ట్విషా శర్మకు భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో 2025 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం ఐదు నెలలకే.. మే 12 రాత్రి భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న అత్తవారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. ట్విషా భర్త, అడ్వకేట్ సమర్థ్ సింగ్‌తో పాటు ఆమె అత్త గిరిబాల సింగ్‌పై వరకట్న మరణం, వేధింపుల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. నిందితురాలైన అత్త గిరిబాల సింగ్ గతంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ కేసులో భర్త సమర్థ్ సింగ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను భోపాల్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, అతని ఆచూకీ తెలిపిన వారికి మధ్యప్రదేశ్ పోలీసులు రూ. 10,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు.
రోడ్డుపై ఒంటరి పోరాటం చేస్తున్నాం
ఈ కేసు దర్యాప్తు పారదర్శకతపై ట్విషా శర్మ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. భోపాల్ వీధుల్లో తాము ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ కేసు దర్యాప్తు పారదర్శకతపై ట్విషా శర్మ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. భోపాల్ వీధుల్లో తాము ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
{{/usCountry}}స్థానిక యంత్రాంగం, రాజకీయ పక్షాలు లేదా ప్రముఖ మహిళా హక్కుల సంఘాల నుంచి తమకు ఎలాంటి ఆశించిన మద్దతు లభించడం లేదని వాళ్లు చెబుతున్నారు. కేసు తర్వాత బెయిల్ పొందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, స్థానిక న్యాయవ్యవస్థలో తనకున్న పాత పరిచయాలు, ప్రభావాన్ని ఉపయోగించి ఉన్నత న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు భోపాల్ కోర్టు ఆవరణలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.