Chiranjeevi: నన్ను తొక్కేయాలని చూస్తున్నావా: స్టేజ్‌పైనే ఫరియాకు చిరంజీవి సెటైర్.. బాస్ తొక్కేస్తాడు ట్రోల్స్‌కి కౌంటర్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా సిగ్మా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన చిరు.. అక్కడ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక్క స్టేట్మెంట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేశారు.
Chiranjeevi: సోషల్ మీడియాలో తనపై వస్తున్న ‘బాస్ తొక్కేసాడు’ మీమ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు. సందీప్ కిషన్ నటించిన 'సిగ్మా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి "నన్ను ఏమైనా తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా" అని సరదాగా కామెంట్ చేసి ట్రోలర్స్‌కి గట్టి షాక్ ఇచ్చారు.

ట్రోల్స్ సైలెంట్‌గా గమనిస్తున్న మెగాస్టార్
గత కొద్ది రోజులుగా నెట్టింట చిరంజీవి యంగ్ హీరోల అవకాశాలు తొక్కేస్తున్నారంటూ నెగెటివ్ బ్యాచ్ మీమ్స్ ప్రచారం చేస్తోంది. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించిన ట్రాక్ రికార్డ్ చిరుకి ఉన్నప్పటికీ, ఈ రకమైన ప్రచారాన్ని కొందరు కావాలనే వైరల్ చేస్తున్నారు.
అయితే నిన్న అంటే శుక్రవారం (సెప్టెంబర్ 25) హైదరాబాద్‌లో జరిగిన 'సిగ్మా' ఈవెంట్‌లో చిరు వేసిన సెటైరికల్ జోక్‌తో తనపై వచ్చే ట్రోల్స్ అన్నింటినీ తను రెగ్యులర్‌గా గమనిస్తున్నట్లు క్లియర్‌గా అర్థమైపోయింది. గతంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సమయంలో కూడా ఇలాగే తనపై వచ్చిన మీమ్స్‌ని సినిమాలో భాగం చేసి స్వీయ సెటైర్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఫరియాతో జోకులు
ఈ సిగ్మా ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ఫరియాతో చిరంజీవి సరదాగా మాట్లాడారు. ఆ మధ్య ఓ ఈవెంట్లో తాను డ్యాన్స్ చేయొద్దని అనుకున్నా.. ఫరియాను చూసి టెంప్ట్ అయిపోయానని అన్నారు.
విశ్వంభరలో ఎందుకు మిస్ అయిందో మరి.. నువ్వేమైనా నో చెప్పావా.. హైట్ ఫ్యాక్టర్ అయితే కాదు.. అలా అయితే నేనే పెద్ద బూట్లు వేసుకునే వాడిని.. నన్నేమైనా తొక్కేద్దామని అనుకున్నావా అని చిరంజీవి అనడంతో ఆడిటోరియం అంతా కేకలు, అరుపులతో నిండిపోయింది. ఫ్యాన్స్ ను చూసి చిరు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇది తాను ట్రోలర్స్ కు ఇస్తున్న కౌంటర్ అని అర్థమైపోయింది.
కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు డెబ్యూ.. చిరు స్పెషల్ బ్లెస్సింగ్స్
ఈవెంట్‌లో అసలైన ఆకర్షణ తమిళ స్టార్ హీరో, ఇప్పటి సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించడం. 24 ఏళ్ల యంగ్ ఏజ్‌లోనే యాక్టింగ్ పక్కనపెట్టి మెగా బడ్జెట్ యాక్షన్ హైస్ట్ డ్రామాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
చిరంజీవి తన స్పీచ్‌లో జేసన్ సంజయ్ తాతగారు ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో తాను పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. విజయ్ తొలి నాళ్లలోని ఒక సినిమాకు తానే క్లాప్ కొట్టానని చెబుతూ, ఈ మూడో తరం డైరెక్టర్‌కి మెగా బ్లెస్సింగ్స్ అందించారు. విజయ్ లా హీరో కాకుండా.. తన తాతయ్య, నాన్నమ్మలోని డైరెక్షన్, రైటింగ్ లక్షణాలు జేసన్ కు వచ్చాయని చిరు అన్నారు.
‘సిగ్మా’ సినిమాకి కలిసొచ్చే బిగ్ ఫ్యాక్టర్స్ ఇవే
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నాని 'ది పారడైజ్' అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ట్రేడ్ వర్గాలు తదుపరి హిట్ కోసం ఎదురుచూస్తున్నాయి. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న 'సిగ్మా' ట్రైలర్ ఇప్పటికే జెన్ జీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కి తమన్ అందించిన బిజిఎమ్, సందీప్ కిషన్ ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్ ప్రధాన బలంగా మారనున్నాయి. సందీప్ కిషన్ కష్టం చూస్తుంటే తన ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయని మెగాస్టార్ అభినందించడం యంగ్ హీరోకి పెద్ద బూస్టప్ ఇచ్చింది.
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కాకా' అప్‌డేట్
ఒకవైపు ఇలా యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూనే, చిరంజీవి తన అప్‌కమింగ్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' షూటింగ్ వేగంగా జరుగుతోంది.
సంక్రాంతి 2027 గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంతటి నెగెటివిటీ వచ్చినా స్మైలింగ్ ఫేస్‌తో సరదా కౌంటర్లు ఇస్తూ దూసుకెళ్లడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


