Chiranjeevi: చిరంజీవి కామెంట్స్ దుమారం.. 'అవార్డుకు ఎన్నో దారులు' అర్థమేంటి? సోషల్ మీడియాలో విమర్శలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడో వింత వివాదంలో చిక్కుకున్నారు. పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు తెచ్చుకోవడానికి ఎన్నో దారులు ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Published on: Jun 24, 2026, 15:24:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన స్పీచ్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఒక రేంజ్ హల్చల్ సృష్టిస్తోంది.

Chiranjeevi: చిరంజీవి కామెంట్స్ దుమారం.. 'అవార్డుకు ఎన్నో దారులు' అర్థమేంటి? సోషల్ మీడియాలో విమర్శలు
Chiranjeevi: చిరంజీవి కామెంట్స్ దుమారం.. 'అవార్డుకు ఎన్నో దారులు' అర్థమేంటి? సోషల్ మీడియాలో విమర్శలు

ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలామంది నేషనల్ అవార్డు గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తుండటంపై చిరు స్పందించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది.

అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి..

ఒక తండ్రిగా రామ్ చరణ్ పడ్డ కష్టం, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఎంతో గర్వపడుతున్నానని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. 'రంగస్థలం', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాల తర్వాత చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ మైల్‌స్టోన్ మూవీ అని కొనియాడారు.

నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

"పెద్ది సినిమాలో నటనకుగాను చరణ్‌కి నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. నిజానికి రంగస్థలం మూవీకే ఆ అవార్డు రావాలని నేను, సుకుమార్ అనుకున్నాం. ఇప్పుడూ అవార్డు రావచ్చు. రాకపోవచ్చు. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ జనాల నుంచి వచ్చే ప్రేమాభిమానాలే ఒక నటుడికి దక్కే అతిపెద్ద అవార్డు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

చిరు అన్న ఈ ఒక్క మాట "అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి" అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్‌కు తెరలేపింది. అవార్డుల వెనుక లాబీయింగ్, మనీ పవర్ లాంటి వేరే మార్గాలు ఉంటాయనే ఉద్దేశంతోనే మెగాస్టార్ ఇలా అన్నారా అనే వైపుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

అల్లు అర్జున్‌ను టార్గెట్ చేశారా? నెటిజన్ల మధ్య ఫ్యాన్ వార్

చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు రకరకాల థియరీలను స్క్రీన్ పైకి తెస్తున్నారు. 'పుష్ప' సినిమాకు గానూ అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

చరణ్‌కు రాని అవార్డు బన్నీకి రావడంపై మెగా ఫ్యామిలీలో లోపల ఏదో అసంతృప్తి ఉందనే రూమర్స్ గతంలోనే వచ్చాయి. ఇప్పుడు చిరు ఈ రకమైన కామెంట్స్ చేయడంతో, అల్లు అర్జున్ లాబీయింగ్ చేసి అవార్డు తెచ్చుకున్నాడనే అర్థం వచ్చేలా మాట్లాడారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నిజానికి చిరంజీవి మనసులో ఆ ఉద్దేశం ఉందో లేదో ఎవరికీ తెలియదు. మన దేశంలో అవార్డుల ఎంపికలో లాబీయింగ్, రికమండేషన్స్ చాలా కామన్‌గా జరుగుతుంటాయనే నమ్మకం అందరిలోనూ ఉంది. చిరు కేవలం క్యాజువల్‌గా ఆ మాట అని ఉండొచ్చు. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఆల్రెడీ నడుస్తున్న కోల్డ్ వార్ కారణంగా, ఈ చిన్న కామెంట్ కాస్తా ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారి టాలీవుడ్ వర్గాల్లో హీట్ పెంచుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More