Ram Charan Modi: ప్రధాని మోదీతో రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. ఫొటోలు షేర్ చేసిన గ్లోబల్ స్టార్

Ram Charan Modi: ప్రధాని నరేంద్ర మోదీతో ఓ స్పెషల్ మూమెంట్ షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. రిపబ్లిక్ సమ్మిట్ 2026లో భాగంగా మోదీని చరణ్ కలిశారు.

Published on: Jun 23, 2026, 21:48:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan Modi: రిపబ్లిక్ సమ్మిట్ 2026లో థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు తగ్గించాలంటూ సామాన్య ప్రేక్షకుల పక్షాన మాట్లాడి అందరి దిల్ ఖుష్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తాజాగా తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక మోస్ట్ పవర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక నేషనల్ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Ram Charan Modi: ప్రధాని మోదీతో రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. ఫొటోలు షేర్ చేసిన గ్లోబల్ స్టార్
Ram Charan Modi: ప్రధాని మోదీతో రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. ఫొటోలు షేర్ చేసిన గ్లోబల్ స్టార్

పీఎం మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయనతో దిగిన ఒక అరుదైన ఫోటోను ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పంచుకుంటూ రామ్ చరణ్ రాసిన నోట్ ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

పీఎం మోదీతో కలవడం ఒక గొప్ప గౌరవం

రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేస్తూ మాట్లాడుతున్న విజువల్ ను పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు చరణ్ తన మనసులోని మాటను పంచుకున్నారు.

“రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీని కలవడం నాకొక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఆయన 'వికసిత్ భారత్' (Viksit Bharat) విజన్.. అలాగే దేశమే సర్వోన్నతం అనే ఆయన 'ఇండియా ఫస్ట్' (India First) సంకల్పం నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. దేశ పౌరులుగా సమాజం పట్ల మనకున్న బాధ్యతలను ఆ మాటలు మరోసారి బలంగా గుర్తుచేశాయి. ఈ కాన్‌క్లేవ్‌కు నన్ను ఆహ్వానించినందుకు అర్నబ్ గోస్వామి (Arnab Goswami)కి, మొత్తం రిపబ్లిక్ మీడియా టీమ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ రామ్ చరణ్ మెగా పోస్ట్ పెట్టారు.

రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రామ్ చరణ్.. ఇలా జాతీయ వేదికలపై దేశ ప్రగతి గురించి, పౌరుల బాధ్యతల గురించి మాట్లాడటం ఆయన మెచ్యూరిటీని చూపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్

ప్రస్తుతం రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర తన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో నాన్‌స్టాప్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ సినిమా చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా ఈరోజే (జూన్ 23న) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకవైపు ఢిల్లీలో పీఎం మోదీని కలిసి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన చరణ్.. సాయంత్రానికి హైదరాబాద్ లో మెగాస్టార్ తో స్టేజ్ షేర్ చేసుకోబోతుండటంతో మెగా ఫ్యాన్స్ కు ఈరోజు పూనకాలే అని చెప్పొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More