Allu Arjun: ఒక్క పోస్టర్‌తో హైప్ పెంచేశారుగా.. అల్లు అర్జున్‌, అట్లీ మూవీ నుంచి క్రేజీ స‌ర్‌ప్రైజ్‌.. ఆ మిస్ట‌రీ ఏంటీ?

Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పుడు ఒకే పోస్టర్ తో ఆ హైప్ ను ఆకాశానికి తీసుకెళ్లారు. మంగళవారం మూవీ  టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ మిస్టీరియస్ గా ఉంది. 

Published on: Apr 7, 2026, 11:18:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ టీమ్ మంగళవారం (ఏప్రిల్ 7) ఓ పోస్టర్ తో స‌ర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై హైప్ ఆశాకానికి తాకేసింది. ఇది చాలా మిస్టీరియస్ గా ఉంది.

అల్లు అర్జున్ మూవీ పోస్టర్ (x/sunpictures)
అల్లు అర్జున్ మూవీ పోస్టర్ (x/sunpictures)

ఏఏ22xఏ6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ఏఏ22xఏ6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 8) రివీల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే మంగళవారం రిలీజ్ చేసిన ఏఏ22xఏ6 మూవీ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అల్లు అర్జున్ మూవీ పోస్టర్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న మూవీ నుంచి ఓ పోస్టర్ ను మేకర్స్ ఇవాళ పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ఒక క్రూర మృగం లేదా వింత జీవి పంజా (చెయ్యి) కనిపిస్తోంది.

ఆ చేతికి పొడవైన, పదునైన గోర్లు ఉన్నాయి. చెయ్యి అంతా దట్టమైన వెంట్రుకలతో నిండి, చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ‘‘బ్లాస్ట్ కోసం సిద్ధం కండి. రేపు ఉదయం 11 గంటలకు టైటిల్ పోస్టర్’’ అని ఈ పోస్టర్ ను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

మిస్టరీ ఏంటీ?

సినిమా నుంచి హీరో కానీ లేదా ఇతర క్యారెక్టర్ల లుక్ కానీ లేదా మోషన్ పోస్టర్ లాంటివి రిలీజ్ చేయకుండా ఒక మిస్టరీ చేతిని పోస్టర్ గా విడుదల చేయడం క్యూరియాసిటీ పెంచుతోంది. అసలు ఈ చేయి వెనుక ఉన్న మిస్టరీ ఏంటీ అని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

పోస్టర్ వెనుక భాగంలో మబ్బులు, చీకటి ఆకాశం, కింద కొన్ని కోటలు లేదా వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక ప్యారలల్ యూనివర్స్ (సమాంతర విశ్వం) కథ అని సినీ వర్గాల సమాచారం.

ఏం ప్లాన్ చేస్తున్నారు?

అట్లీ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావ్? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. పోస్టర్ తోనే హైప్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఏఏ22xఏ6 మూవీ సైన్స్ ఫిక్షన్ లేదా సూపర్ నేచురల్ యాక్షన్ సినిమా అని అర్థమవుతోంది.

సినిమాలో అల్లు అర్జున్ ఒక వింత శక్తి ఉన్న పాత్రలో గానీ, లేదా ఇలాంటి వింత జీవులతో పోరాడే పాత్రలో గానీ కనిపిస్తారని అంచనా. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More