ఎవరి ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుంది.. దీపిక నా లక్కీ ఛార్మ్: అల్లు అర్జున్ సినిమాపై అట్లీ కామెంట్స్
నటి దీపికా పదుకోన్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ మళ్లీ రాబోతోంది. అల్లు అర్జున్‌తో చేయబోయే భారీ సినిమా కోసం దీపికాను తీసుకున్నట్లు అట్లీ ధృవీకరించాడు. ఈ సందర్భంగా ఆమెను తన ‘లక్కీ ఛార్మ్’ అని అభివర్ణించాడు. ఈ సినిమా కోసం చిత్ర బృందం నిద్ర లేకుండా కష్టపడుతోందని అతడు చెప్పాడు.
‘జవాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అట్లీ, నటి దీపికా పదుకోన్ మరోసారి జతకట్టనున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోయే ‘AA22xA6’ అనే తెలుగు సినిమాలో దీపిక నటించనుంది. ఇండియా టుడేతో మాట్లాడుతూ అట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి, దీపికా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మూవీ ఎవరి ఊహకు అందని రీతిలో అత్యంత భారీగా ఉండబోతున్నట్లు చెప్పాడు.

నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం..
అల్లు అర్జున్, దీపికా పదుకోన్ మూవీ గురించి డైరెక్టర్ అట్లీ మాట్లాడాడు. తాము ప్రేక్షకుల కోసం చాలా భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నామని చెప్పాడు.
"ప్రతి రోజూ మేము ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటున్నాం. సినిమా గురించి వినడానికి అందరూ ఎంత ఆశగా ఉన్నారో నాకు తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే ప్రేక్షకుల కంటే ఎక్కువగా నేను వారికి అన్నీ చెప్పడానికి ఎదురుచూస్తున్నాను. దీనికోసం మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. దీనిని సాకుగా చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి కోసం ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం. మేము కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాం. ఇది పూర్తయ్యాక అందరూ దీన్ని చాలా బాగా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని అట్లీ పేర్కొన్నాడు.
దీపికా నా లక్కీ ఛార్మ్..
దీపికాతో మళ్లీ పని చేయడంపై అట్లీ సంతోషం వ్యక్తం చేశాడు. "అవును.. ఆమె నా లక్కీ ఛార్మ్. దీపికాతో ఇది నా రెండో సినిమా. ఆమెతో పని చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లి అయిన తర్వాత ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో మీరు కచ్చితంగా సరికొత్త దీపికాను చూస్తారు" అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అల్లు అర్జున్, అట్లీ సినిమా విశేషాలు..
సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్' నుంచి తప్పుకున్న తర్వాత, గతేడాది దీపిక ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్, అట్లీ తొలిసారి కలిసి పని చేస్తున్నారు. "రాణి జయించడానికి వస్తోంది" అంటూ సన్ పిక్చర్స్ దీపికకు వెల్‌కమ్ చెప్పింది. 'కల్కి 2898 ఏడీ' తర్వాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు పాన్-ఇండియా సినిమా ఇది.
దీపికా ఇతర సినిమాలు..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడీ'లో దీపికా చివరిగా కనిపించింది. అయితే ఆ సినిమా సీక్వెల్ నుంచి ఆమెను గతేడాది తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


