అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ ఇదేనా.. రెండు పోస్టర్లతో బర్త్‌డే విషెస్‌తో అయోమయం
అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసినట్లేనా? ఈ మూవీ మేకర్స్ ఆమె బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన రెండు వేర్వేరు పోస్టర్లు అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ సోమవారం (జనవరి 5) తన 40వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం (AA22 X A6) నుంచి అప్డేట్ లేదా ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’, 'సన్ మ్యూజిక్' రిలీజ్ చేసిన పోస్టర్స్ చూసి ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. అసలు ఇవి అఫీషియల్ పోస్టర్లా లేక ఫ్యాన్ ఎడిట్సా అని తలలు పట్టుకుంటున్నారు.

సమురాయ్ లుక్.. నెటిజన్ల ట్రోల్స్
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందులోనూ దీపికా పుట్టినరోజు కావడంతో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అంతా భావించారు. కానీ జరిగింది వేరు. సన్ నెట్‌వర్క్ రిలీజ్ చేసిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
దీపికా పదుకోన్ ఒక ఫ్లోవీ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సన్ పిక్చర్స్ విషెస్ చెప్పింది. అయితే ఇది మే 2025లో ఒక మ్యాగజైన్ కోసం దీపికా చేసిన ఫోటోషూట్‌లోని పిక్ అని ఫ్యాన్స్ వెంటనే పసిగట్టేశారు.
కానీ సన్ మ్యూజిక్ మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని 'సమురాయ్' గెటప్‌లో ఉన్న దీపికా ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇది కచ్చితంగా ఏఐతో చేసిన ఫోటోలా ఉందని అంటున్నారు.
"కల్కి మిగిలిపోయిన పోస్టరా?"
ఈ పోస్టర్లపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "కల్కి సినిమాలో మిగిలిపోయిన పోస్టర్‌కి వాటర్ మార్క్ యాడ్ చేసినట్టు ఉంది" అని ఒకరు సెటైర్ వేయగా.. "ఇది చూడటానికి మరీ AI కోడెడ్‌గా ఉంది. స్కిన్ టోన్ చూస్తుంటే చాట్ జీపీటీ జనరేట్ చేసినట్టుంది" అని మరొకరు కామెంట్ చేశారు.
అట్లీ గానీ, అల్లు అర్జున్ గానీ ఈ పోస్టర్లను షేర్ చేయకపోవడంతో.. ఇవి కేవలం ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ అని, అఫీషియల్ ఫస్ట్ లుక్ కాదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.
AA22 X A6 సినిమా గురించి..
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత నటిస్తున్న మూవీ ఇది. ఇంకా టైటిల్ పెట్టలేదు. అతని కెరీర్లో ఇది 22వ సినిమా కాగా.. సూపర్ హిట్ డైరెక్టర్ అట్లీకి ఇది ఆరో మూవీ. దీంతో ఇద్దరి పేర్లు, సినిమా నంబర్ కలిపి పిలుస్తున్నారు. ఇదొక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా అని సమాచారం.
ఇందులో దీపికా పదుకోన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఆరు నెలల కిందటే ఆమె మూవీలోకి ఎంటరైనట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూస్తే.. ఇప్పుడు దీపికా ఫొటో దానికి సంబంధించిందే అనుకునేలా ఉంది. ఆ వీడియోలో దీపికాను ఒక ‘వారియర్’లాగా చూపించారు కానీ సమురాయ్ లాగా కాదు.
మొత్తానికి దీపికా బర్త్‌డే నాడు అఫీషియల్ క్లారిటీ ఇవ్వకుండా సన్ నెట్‌వర్క్ ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


