సినిమాలో విలన్-కలెక్షన్లలో హీరో-ఒకే ఏడాదిలో రూ.2000 కోట్లు-ధురంధర్ నటుడి రికార్డు-ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా
సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న ధురంధర్ నటుడు అక్షయ్ ఖన్నా, కలెక్షన్లలో కొత్త రికార్డులతో హీరో అనిపించుకుంటున్నాడు. ఒక ఏడాది కాలంలో తను నటించిన సినిమాలతో రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన రెండో నటుడిగా నిలిచాడు. అతని కంటే ముందు షారుక్ ఉన్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్ కు ఈ రికార్డు అందలేదు.
సినీ పరిశ్రమలో అక్షయ్ ఖన్నాకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. కానీ 2025 ను మాత్రం అక్షయ్ ఖన్నా సంవత్సరం అని పిలవడం అతిశయోక్తి కాదు. 2025లో ఈ నటుడు ఛావా, ధురంధర్ రెండు చిత్రాలలో విలన్ గా నటించాడు. ఆ చిత్రాలు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు, అక్షయ్ ఒక గొప్ప ప్రజాదరణ మైలురాయిని కూడా అధిగమించాడు.

రూ.2000 కోట్లు
ఒక ఏడాది (365 రోజుల) వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర రూ.2 వేల కోట్లు వసూలు చేసిన రెండో నటుడిగా అక్షయ్ ఖన్నా నిలిచాడు. అతను ఈ ఏడాది కాలంలో నటించిన రెండు సినిమాలు.. ఛావా, ధురంధర్ బాక్సాఫీస్ మోత మోగించాయి. ఇది రెండు కలిపి కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటాయి. దీంతో అరుదైన రికార్డు అక్షయ్ ఖన్నా ఖాతాలో చేరింది.
ఛావా ఇలా
లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘ఛావా’ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశాడు. 2025 జనవరిలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.809 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నాడు. తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు.
ధురంధర్ కలెక్షన్లు
2025 డిసెంబర్ లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’లో గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ దకైత్ గా అక్షయ్ ఖన్నా నటించాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ లతో పాటు రణవీర్ సింగ్ నటించినప్పటికీ, అక్షయ్ యాక్టింగ్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1167 కోట్లు వసూలు చేసింది. శనివారం ముగిసే వరకు మరో రూ.25 కోట్లకు పైగా ఖాతాలో వేసుకునే అవకాశముంది.
2023లో షారుక్
షారుక్ ఖాన్ 2023లో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆ సంవత్సరంలో షారుక్ ఖాన్ మూడు సినిమాలు.. పఠాన్, జవాన్, డంకీ కలిసి ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ వద్ద సంయుక్తంగా రూ.2685 కోట్లు వసూలు చేశాయి. ఆ ఘనత సాధించిన ఫస్ట్ భారతీయ నటుడిగా షారుక్ ఖాన్ నిలిచాడు. ఇప్పుడు అక్షయ్ ఖన్నా రెండో నటుడిగా రికార్డు అందుకున్నాడు.
మరోవైపు ప్రభాస్, అల్లు అర్జున్ ఈ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయారు. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2, అల్లు అర్జున్ లీడ్ రోల్ ప్లే చేసిన పుష్ప 2 ఒక్కొక్కటి రూ.1700 కోట్లకు పైగా వసూలు చేశాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


