దీపికా పదుకొనే బర్త్‌డే-ఈ టాప్ హీరోయిన్ నెట్‌వర్త్ తెలిస్తే షాక్ అవాల్సిందే-సినిమాకు రికార్డు రెమ్యునరేషన్
ఇండియాలోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా యాక్టింగ్ తో అదరగొడుతోంది దీపికా. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా దీపికా నెట్ వర్త్ ఎంతో చూద్దాం.
అందంతో, యాక్టింగ్ తో అదరగొడుతోంది దీపికా పదుకొనే. ఈ బాలీవుడ్ భామ దేశంలో ఇతర భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇవాళ (జనవరి 5) దీపికా పదుకొనే బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నెట్ వర్త్, ఆస్తులు, సినిమాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దీపికా పదుకొనే నెట్ వర్త్
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఇటు సినిమాలతో, అటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో దీపికా బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ విలువ రూ.500 కోట్లు. అవును.. మీరు చదివింది నిజమే. ఇండియాలోనే అత్యధిక నెట్ వర్త్ కలిగి ఉన్న హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు.
రెమ్యునరేషన్
బర్త్ డే భామ దీపికా పదుకొనే తన సినిమాలకు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తుందని తెలిసింది. కొన్ని సినిమాలకు అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుందని కూడా సమాచారం. మరోవైపు కొన్నేళ్లుగా ప్రముఖ బ్రాండ్లను ఆమె ప్రమోట్ చేస్తోంది. ఈ బ్రాండ్ల ప్రమోషన్ తోనూ ఆమె కోట్లకు కోట్లు ఖాతాలో వేసుకుంటుంది.
దీపికా ఆస్తులు
దీపికా పదుకొనే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు చాలా ఆస్తులే ఉన్నాయి. ఇందులో బాంద్రాలో ఉన్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ గురించి చెప్పుకోవాలి. షారుక్ ఖాన్ ఇల్లు మన్నత్ కు సమీపంలోనే ఉండే ఈ ఫ్లాట్ ను 2022లో రూ.119 కోట్లు పెట్టి కొన్నారు.
మరోవైపు అలిబాగ్ లో దీపికాకు రూ.22 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అంతే కాకుండా వర్లీలోని బ్యూమోండే టవర్స్ లో అపార్ట్ మెంట్ ఉంది. దాని వాల్యూ రూ.42 కోట్లు. దీపికా దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లున్నాయి.
దీపికా సినిమాలు
2006లో కన్నడ సినిమా ఐశ్వర్యతో డెబ్యూ చేసింది దీపికా పదుకొనే. ఆ తర్వాత ఏడాది షారుక్ ఖాన్ హీరోగా చేసిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2014లో తమిళంలో కొచాడైయాన్ చిత్రంలో యాక్ట్ చేసింది. ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జేండర్ కేజ్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2024లో ప్రభాస్ కల్కి 2898 ఏడీతో తెలుగులో ప్రవేశించింది. ఇప్పుడు షారుక్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తోంది దీపికా పదుకొనే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


