500 కోట్ల ప్రాజెక్టులకు దీపికా పదుకొనే గుడ్ బై? డబ్బు కాదు వ్యక్తులను నమ్ముతానంటూ సంచలన వ్యాఖ్యలు.. ఈ కామెంట్లు ఎవరికి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల విషయానికి వస్తే తనకు డబ్బు కంటే మనుషులే ముఖ్యమని స్పష్టం చేసింది. పెద్ద ప్రాజెక్ట్ లు చేయననే అర్థం వచ్చేలా మాట్లాడింది. 

Published on: Nov 18, 2025, 09:06:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇకపై ఆమె భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ల్లో భాగం కాదనే అర్థం వచ్చేలా మాట్లాడింది. పదేళ్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి, బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో భాగమైన దీపికా తన ఆలోచన విధానాన్ని మార్చుకుంది. హార్పర్'స్ బజార్‌తో ఇటీవల ఇంటర్వ్యూలో దీపికా ఈ కామెంట్లు చేసింది.

దీపికా పదుకొనే (AFP)
దీపికా పదుకొనే (AFP)

500 కోట్లు కాదు

బాక్సాఫీస్ మైల్ స్టోన్స్, భారీ బడ్జెట్ సినిమాలు తనను అంతగా ఆకర్షించడం లేదని దీపికా పదుకొణే తెలిపింది. ‘‘ఇకపై రూ.100 కోట్ల లేదా రూ.500 కోట్ల చిత్రాల గురించి కాదు. నా ప్రాధాన్యతలు గణనీయంగా మారాయి. ఈ దశలో ఇకపై అది రూ.100 కోట్ల చిత్రాలు లేదా రూ.500–600 కోట్ల చిత్రాలు అని ఆలోచించను’’ అని దీపికా చెప్పింది.

డబ్బు ఆఫర్

"నాకు నిజమనిపించనిది ఏదీ నన్ను ఆకట్టుకోదు. కొన్నిసార్లు ప్రజలు చాలా డబ్బు ఆఫర్ చేసి, అది సరిపోతుందని భావిస్తారు. కానీ అది ముఖ్యం కాదు. దీనికి విరుద్ధంగా కూడా కొన్ని నిజాలుంటాయి. కొన్ని ప్రాజెక్టులు వాణిజ్యపరంగా పెద్దవి కాకపోవచ్చు. కానీ నేను ఆ వ్యక్తులను లేదా సందేశాన్ని నమ్ముతా. దాని కోసం నిలబడతా’’ అని దీపిక తెలిపింది.

ఎవరి గురించి?

దీపికా పదుకొనే తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డబ్బు ముఖ్యం కాదు వ్యక్తులు అని ఆమె చేసిన కామెంట్ల వెనకాల ఉద్దేశం ఏంటీ అనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. పని గంటలు, రెమ్యునరేషన్ విభేధాలతో స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. ఈ ప్రాజెక్టుల నేపథ్యంలోనే దీపికా పదుకొనే కామెంట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ ప్రభాస్ హీరో.

సొంత బ్యానర్

తన బ్యానర్ కేఏ ప్రొడక్షన్స్ కింద కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తోంది దీపికా పదుకొనే. ఈ బ్యానర్ కింద ‘ఛపాక్’ మూవీని నిర్మించింది దీపికా.

"ఇతరులకు అవకాశాలు కల్పించడం నన్ను ఉత్తేజపరుస్తుంది. నా బృందం, నేను ఇప్పుడు కథాకథనానికి సహాయం చేస్తున్నాం. రచయితలు, దర్శకులు, కొత్త నిర్మాతలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తున్నాం. అది ఇప్పుడు నాకు అర్థవంతంగా అనిపిస్తుంది. రోజుకు ఎనిమిది గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు మీ బెస్ట్ ఇవ్వగలరు" అని దీపికా తెలిపింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More