Allu Arjun Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్.. గుడ్ న్యూస్.. రేపు ఉదయం 11 గంటలకు.. బన్నీ బర్త్‌డేకు ఒక రోజు ముందే సర్‌ప్రైజ్

Allu Arjun Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా ఫిల్మ్ అప్‌డేట్ సిద్ధమైంది. రేపు అంటే మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు అప్డేట్ రానుంది. ఇది సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను కావచ్చని అంచనా వేస్తున్నారు.

Published on: Apr 6, 2026, 19:55:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun Atlee: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం 'AA22 x A6' (వర్కింగ్ టైటిల్) అనే భారీ పాన్-ఇండియా మూవీ రూపొందుతోంది. రేపు అంటే మంగళవారం (ఏప్రిల్ 7) అల్లు అర్జున్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది.

Allu Arjun Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్.. గుడ్ న్యూస్.. రేపు ఉదయం 11 గంటలకు.. బన్నీ బర్త్‌డేకు ఒక రోజు ముందే సర్‌ప్రైజ్
Allu Arjun Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్.. గుడ్ న్యూస్.. రేపు ఉదయం 11 గంటలకు.. బన్నీ బర్త్‌డేకు ఒక రోజు ముందే సర్‌ప్రైజ్

రేపు ఉదయం 11 గంటలకు 'బిగ్ అప్‌డేట్'

చాలా కాలంగా సస్పెన్స్‌లో ఉన్న అల్లు అర్జున్, అట్లీ మూవీ తాలూకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. మూవీని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్.. సింపుల్ గా రేపు ఉదయం 11 గంటలకు #AA22 x A6 అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, ఈ సినిమా ఒక 'ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్' అని తెలుస్తోంది. అట్లీ కెరీర్‌లోనే ఇది మొదటిసారిగా భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ హంగులతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్ - దీపికా పదుకోన్ కాంబో

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ స్టార్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

కొత్త ప్రపంచంలోకి అట్లీ..

'జవాన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటివరకు కమర్షియల్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన అట్లీ.. ఈసారి ఫాంటసీ జోనర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి రేపు ప్రకటించబోయే టైటిల్ ఏంటి? అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉండబోతోంది? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: అల్లు అర్జున్ - అట్లీ సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు?

జవాబు: ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

ప్రశ్న: ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు?

జవాబు: ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు.

ప్రశ్న: ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

జవాబు: సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More