...
...
Next Story

Chiranjeevi: కనిపించే దైవం కూడా కని పెంచిన మాతృమూర్తి తర్వాతే.. మదర్స్ డే సందర్భంగా అరుదైన ఫొటోలు పంచుకున్న చిరంజీవి

Chiranjeevi: మదర్స్ డే 2026 సందర్భంగా చిరంజీవి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన తల్లితో ఉన్న అరుదైన ఫొటోలను చిరంజీవి ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Published on: May 10, 2026, 12:15:51 IST
Advertisement

Chiranjeevi: సందర్భంగా ఏదైనా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా రియాక్టవుతుంటారు. ఇవాళ మదర్స్ డే సందర్భంగానూ చిరు ఓ ట్వీట్ చేశారు. తన తల్లితో, తోబుట్టువులతో, సోదరులతో ఉన్న అరుదైన చిత్రాలను కూడా పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

చిరంజీవి ట్వీట్

తల్లితో చిరంజీవి (x/KChiruTweets)
తల్లితో చిరంజీవి (x/KChiruTweets)

మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ చిరంజీవి పెట్టిన పోస్టు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అమ్మ గొప్పతనాన్ని చాటేలా మెగాస్టార్ పోస్టు ఉంది. తన బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబుతో పాలు తల్లిదండ్రులు, సిస్టర్స్ తో ఉన్న రేర్ ఫొటోలనూ చిరంజీవి పంచుకున్నారు.

మొదటి గురువు

‘‘అమ్మ… మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం. కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని చిరంజీవి ఎక్స్ లో పోస్టు చేశారు.

అంజనమ్మపై ప్రేమ

2026ను చిరంజీవి బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ చేశారు. సంక్రాంతికి వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ తో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

విశ్వంభర

చిరంజీవి ఈ ఏడాది మరో మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చిరు నటించిన సోషియా ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

మెగాస్టార్ ప్రస్తుతం బాబీ కొల్లి డైరెక్షన్ లో ఓ మాస్ మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

పవన్ ఇలా

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాన్ రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లో సందడి చేశారు. కానీ ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. పవన్ నెక్ట్స్ మూవీపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు డైరెక్టర్ సుజీత్ ఏమో ఓజీ 2 పనులు మొదలెట్టాడనే వార్తలు వస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks