Chiranjeevi Glimpse: చిరంజీవికి కుడివైపు గుండె.. ఎడమవైపు హార్ట్ బీట్.. బోల్డ్‌గా, ఇంట్రెస్టింగా గ్లింప్స్ వీడియో

Chiranjeevi Glimpse: ‘చిరంజీవి’ మూవీ గ్లింప్స్ వీడియో రిలీజైంది. కుడి వైపు గుండె ఉన్న హీరోకి, ఎడమవైపు హార్ట్ బీట్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా బోల్డ్, ఇంట్రెస్టింగా ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆసక్లి రేపుతోంది.

Published on: Apr 20, 2026, 16:01:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi Glimpse: మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా 'చిరంజీవి' చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ గతంలోనే గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ సోమవారం (ఏప్రిల్ 20) హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిత్ర కథాంశం కొత్తగా ఉండటమే కాకుండా, మనసుకు హత్తుకునే భావోద్వేగాలు ఉండబోతున్నాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi Glimpse: చిరంజీవికి కుడివైపు గుండె.. ఎడమవైపు హార్ట్ బీట్.. బోల్డ్‌గా, ఇంట్రెస్టింగా గ్లింప్స్ వీడియో
Chiranjeevi Glimpse: చిరంజీవికి కుడివైపు గుండె.. ఎడమవైపు హార్ట్ బీట్.. బోల్డ్‌గా, ఇంట్రెస్టింగా గ్లింప్స్ వీడియో

డెక్స్ట్రోకార్డియా: కుడివైపున గుండె..

ఈ చిరంజీవి మూవీ 'డెక్స్ట్రోకార్డియా' (Dextrocardia) అనే అరుదైన ఆరోగ్య పరిస్థితి చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా మనకు గుండె ఎడమవైపున ఉంటుంది.. కానీ ఈ సినిమాలో హీరో చిరుకు గుండె కుడివైపున ఉంటుంది.

గ్లింప్స్ చూస్తుంటే హీరోకు ఆక్సిజన్ అందక శరీరం నీలం రంగులోకి మారిపోవడం వంటి సీన్స్ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం అతను పడే తపన, అతని ప్రాణాన్ని కాపాడేందుకు హీరోయిన్ ఇచ్చే మౌత్-టు-మౌత్ ఆక్సిజన్ సన్నివేశాలు సినిమా తీవ్రతను చాటిచెబుతున్నాయి.

ఉత్కంఠ రేపుతున్న క్లైమాక్స్ ట్విస్ట్

గ్లింప్స్ ముగింపులో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చూపించారు. హీరో మాంచి నిద్రలో ఉంటాడు. అతడు ఎదపై వాలిన హీరోయిన్ కు గుండె చప్పుడు ఎడమ వైపు వినిపిస్తుంది. చిరుకి కుడి వైపు కదా గుండె ఉంది.. మరి ఎడమవైపు చప్పుడు వినిపిస్తోందేంటి అన్న సందేహం ఆమెలో కలుగుతుంది. అంతటితో గ్లింప్స్ వీడియో ముగుస్తుంది. ఇది ఈ సినిమా కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉందో చూపిస్తోంది.

కికు యమనాల, కాశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు, గోపరాజు రమణ, శ్రీకాంత్ భరత్, వివ రాఘవ్ వంటి అనుభవం ఉన్న నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొత్త తరం కథాంశంతో వస్తున్న ఈ సినిమా తెలుగు వెండితెరపై ఒక వైవిధ్యమైన ప్రయోగంగా నిలవనుంది.

సమ్మర్ రిలీజ్‌కు సిద్ధం

కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాయి వెంకట్ రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'చిరంజీవి' సినిమా ప్రధాన కథాంశం ఏమిటి?

ఇది 'డెక్స్ట్రోకార్డియా' అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న చిరు అనే యువకుడి కథ. గుండె కుడివైపున ఉండటం వల్ల అతను ఎదుర్కొనే ఇబ్బందులు, అతని పోరాటమే ఈ సినిమా.

2. చిరంజీవి మూవీలో నటీనటులు ఎవరు?

కికు యమనాల, కాశిష్ ఖాన్ జంటగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో ఉన్నారు.

3. చిరంజీవి సినిమా గ్లింప్స్‌ను ఎవరు విడుదల చేశారు?

మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More