Chiranjeevi Gv Narayana: ఆయనకు మాట ఇచ్చా.. అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు.. ఫ్రెండ్ మృతికి చిరంజీవి నివాళులు!

Chiranjeevi Gv Narayana: ప్రముఖ నటుడు, నిర్మాత జివి నారాయణరావు పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజుల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోలు వైరల్ గా మారాయి. తన మిత్రుడిని తలుచుకుని ఆయన బాధపడ్డారు.

Published on: Aug 28, 2026, 13:27:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi Gv Narayana: ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తన మిత్రుడైన ఆయన భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నేరుగా వెళ్లి నివాళులర్పించారు. నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తన ఆప్తమిత్రుడితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, తీపి గుర్తును నెమరువేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆయనకు మాట ఇచ్చా.. అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు.. ఫ్రెండ్ మృతికి చిరంజీవి నివాళులు!
ఆయనకు మాట ఇచ్చా.. అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు.. ఫ్రెండ్ మృతికి చిరంజీవి నివాళులు!

మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజుల నుంచి

జివి నారాయణరావుతో తనకున్న స్నేహం గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మేమిద్దరం శిక్షణ పొందుతున్న రోజుల నుంచే ఒకరికొకరం బాగా తెలుసు. అక్కడ ఆయన నా కంటే సీనియర్. మేము శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయన వచ్చి తన అనుభవాలను మాతో పంచుకునేవారు. ఆ విధంగానే మా మధ్య చొరవ పెరిగి, మంచి స్నేహం ఏర్పడింది" అని చిరంజీవి తెలిపారు.

కలిసి చేసిన సినిమాలు

పరిశ్రమలో ఇద్దరి ఎదుగుదల గురించి చిరంజీవి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో మేమిద్దరం ఎదుగుతున్న క్రమంలో, నాకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఆయన నా దగ్గరకు వచ్చారు. 'నేను నిర్మాతగా నిలదొక్కుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాతో సినిమాలు చేయాలి' అని అడిగారు.

ఆయన కోరిక మేరకు ఆయన నిర్మాణంలో నేను రెండు సినిమాలు చేశాను. అలాగే నా సినిమాల్లో కూడా ఆయనకు నటుడిగా అవకాశాలు దక్కేలా చూశాను. మా అనుబంధం అలా కొనసాగింది’’ అని తెలిపారు.

పది రోజుల క్రితమే

చివరిసారిగా జివి నారాయణ రావుతో మాట్లాడుకున్న సంఘటనను చిరంజీవి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. "పది రోజుల క్రితమే ఆయన నన్ను కలిశారు. 'నేను ఒక సినిమా తీశాను. 'మంచు పల్లకి' సినిమా స్ఫూర్తితో ఐదుగురు యువకుల కథ ఆధారంగా దీనిని తెరకెక్కించాను.

వారు పెద్దయ్యాక ఏం జరిగిందనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నువ్వే లాంచ్ చేయాలి, నీ సపోర్ట్ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది' అని నన్ను కోరారు. తప్పకుండా చేస్తానని నేను ఆయనకు మాట ఇచ్చాను" అని మెగాస్టార్ పేర్కొన్నారు.

అవే చివరి మాటలు

"ఆ సమయంలోనే నాతో కలిసి ఒక ఫోటో దిగాలని ఆయన కోరారు. బహుశా అది ఆయన నిర్మించిన చివరి సినిమా కావచ్చు. ఆ రోజు మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఆల్‌ది బెస్ట్ తెలియజేశాను. కానీ ఆ మాటలే మా చివరి సంభాషణ అవుతాయని, ఆయన శాశ్వతంగా సెలవు తీసుకుంటారని నేను అసలు ఊహించలేదు" అని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More