Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో అద్భుతం.. హనుమంతుడిని తాకిన సూర్య కిరణాలు.. హనుమాన్ జయంతి రోజు వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi: హనుమాన్ జయంతి రోజు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తమ ఇంట్లోని అద్భుతాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకడం ఎంతో అద్భుతంగా ఉంది. 

Published on: Apr 2, 2026, 12:24:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరూ ఆ ఆంజనేయుడి నామ స్మరణలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అద్భుతమైన వీడియో తెగ వైరల్ గా మారింది. చిరంజీవి ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్న అద్భుతమైన దృశ్యాన్ని మెగాస్టార్ పంచుకున్నారు.

చిరంజీవి షేర్ చేసిన వీడియోలోని అద్భుతం (x/KChiruTweets)
చిరంజీవి షేర్ చేసిన వీడియోలోని అద్భుతం (x/KChiruTweets)

హనుమంతుడి వీడియో

హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2) చిరంజీవి ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో చిరంజీవి ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్నాయి. విగ్రహం పైనుంచి కింది వరకూ సూర్య కిరణాలు ప్రసరించడం క్లియర్ గా కనిపించింది.

చిరంజీవి పోస్టు

మెగాస్టార్ చిరంజీవి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్’’ అనే క్యాప్షన్ తో చిరంజీవి వీడియో పోస్టు చేశారు.

సప్త వర్ణాలుగా మారి

‘‘శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా మా పూజ మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజ మందిరంలో ఉన్న హనుమంతుణ్ని పై నుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే.. ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్య కాంతి ప్రసరించి మెరిసే అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవిల్లి దేవాయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందిరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పవిత్రమైన హనుమజ్జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఆ వీడియోలో చిరంజీవి పేర్కొన్నారు.

దైవ భక్తి

మెగాస్టార్ చిరంజీవికి దైవభక్తి ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్ల ఇలవేల్పు ఆంజనేయుడికి మరింత భక్తితో ఆరాధిస్తారు. అందుకే తన కొడుకుకు కూడా రామ్ చరణ్ అని ఆ హనుమంతుడి పేరు వచ్చేలా పేరు పెట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ ఆ వాయు పుత్రుడిని చిరంజీవి తలుచుకుంటూనే ఉంటారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More