Chiranjeevi Donation: ఎన్టీఆర్ అవార్డ్ మనీ 10 లక్షలు విరాళం ఇచ్చిన చిరంజీవి- కొడుకు చరణ్ పుట్టినరోజున 5 సంస్థలకు అండగా!
Chiranjeevi Donates NTR Award Money: తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకున్న ఎన్టీఆర్ అవార్డ్ నగదు పురస్కారం రూ. 10 లక్షలను చిరంజీవి సామాజిక సేవ కోసం విరాళంగా ఇచ్చారు. కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఐదు స్వచ్ఛంద సంస్థలకు ఈ మొత్తాన్ని అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ అవార్డు'తో గౌరవించడంతో పాటు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోకుండా.. తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.
ఐదు సంస్థలకు అండగా మెగాస్టార్
సామాజిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఐదు వేర్వేరు సంస్థలకు చిరంజీవి ఈ ఎన్టీఆర్ అవార్డ్ నగదు రూ. 10 లక్షలను పంపిణీ చేశారు. 'సర్వ్ ఫౌండేషన్'కు చెందిన 30 మంది వృద్ధులను స్వయంగా ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు బహుకరించి విందు భోజనం ఏర్పాటు చేశారు.
దీంతో పాటు దృష్టి లోపం ఉన్న వారికి అండగా నిలుస్తున్న 'దేవ్నార్ ఫౌండేషన్', అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న 'వాల్మీకి ఫౌండేషన్', 'నయశ్రీ ఫౌండేషన్'లకు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక చిన్నారి చికిత్స నిమిత్తం 'బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్'కు విరాళం ఇచ్చి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు చిరంజీవి.
కొడుకుపై తండ్రి ప్రేమ.. ఎమోషనల్ పోస్ట్!
అలాగే, రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ఎక్స్ (X) వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. చరణ్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. "చరణ్ బాబు.. చిన్నప్పుడు నా వేలు పట్టుకుని నడిచిన స్థాయి నుంచి, ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి ఎదిగావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సినిమాను, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబం పట్ల నీ బాధ్యత, దైవ భక్తి, క్రమశిక్షణ చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి" అని చిరంజీవి రాసుకొచ్చారు.
"దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలు నిన్ను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి కోరారు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ.. "థాంక్యూ నాన్న.. మీ ఆశీస్సులే నాకు సర్వస్వం" అని బదులిచ్చారు.
పెద్ది సినిమా గురించి
మరోవైపు రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం రెడీ అవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


