Chiranjeevi Samantha: మెగాస్టార్ ఇంట్లో బంగారం.. సమంతకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి దంపతులు.. గుడ్ న్యూస్ వైరల్

Chiranjeevi Samantha: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సమంతకు ఊహించని గిఫ్ట్ అందించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Published on: Jun 23, 2026, 05:54:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi Samantha: సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కావడం వేరు, ఒక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ కేవలం మూడు రోజుల్లోనే రూ.43 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం వేరు. సమంత (Samantha) బ్రేక్ తర్వాత సరికొత్త ఎనర్జీతో రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. తాజాగా మూవీ యూనిట్ ను మెగాస్టార్ అభినందించడం వైరల్ గా మారింది.

మెగాస్టార్ ఇంట్లో బంగారం.. సమంతకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి దంపతులు (x/TralalaPictures)
మెగాస్టార్ ఇంట్లో బంగారం.. సమంతకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి దంపతులు (x/TralalaPictures)

మెగాస్టార్ ఇంట్లో బంగారం

మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ కు చిరంజీవి, సురేఖ దంపతులు ఫిదా అయ్యారు. హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డిని ఇంటికి పిలిపించుకొని మరీ ప్రశంసించారు.

అపురూపమైన కానుక

ఈ సందర్భంగా చిరంజీవి, సురేఖ దంపతులు చిత్ర యూనిట్‌ను శాలువాలతో సత్కరించడమే కాకుండా, సమంతకు సాంప్రదాయబద్ధంగా ‘సారె’ పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఆచారంలో ఒక ఆడబిడ్డ అసాధారణ విజయాన్ని సాధించినప్పుడు లేదా ఒక పెద్ద మైల్‌స్టోన్ రీచ్ అయినప్పుడు ఇంట్లోని పెద్దలు పట్టుచీర, తాంబూలంతో పాటు మంగళకరమైన వస్తువులను ‘సారె’గా ఇస్తారు. అంతేకాకుండా ఇప్పుడు సామ్ ప్రెగ్నెంట్ అనే న్యూస్ వినిపిస్తున్నాయి.

వైరల్ గా ఫొటోలు

సమంత తన వ్యక్తిగత హెల్త్ స్ట్రగుల్స్ దాటుకుని, సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై మా ఇంటి బంగారంతో భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మెగాస్టార్ దంపతులు సమంతకు ఒక కాస్ట్లీ పట్టుచీరతో పాటు పవిత్రమైన ‘పూజ శంఖం’ బహుమతిగా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ యాక్టర్ ఫ్యామిలీ.. ఒక స్టార్ హీరోయిన్‌ను తమ సొంత ఆడబిడ్డలా భావించి ఇలా ఇంటికి పిలిచి గౌరవించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 ఏళ్ల బ్రేక్.. రూ.43 కోట్ల రికవరీ!

ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. సౌత్ ఇండియా సినిమాల్లో నయనతార తర్వాత సోలో మార్కెట్‌తో థియేట్రికల్ బిజినెస్‌ను శాసించగల కెపాసిటీ సమంతకు మాత్రమే ఉందని 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు నిరూపించాయి. సాధారణంగా ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీకి థియేట్రికల్ రన్ వీక్ గా ఉంటుందనే అపోహను నందిని రెడ్డి మేకింగ్ స్టైల్ బ్రేక్ చేసింది.

మా ఇంటి బంగారం చిత్రం థియేటర్ల కలెక్షన్ల ద్వారానే కాకుండా.. సాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సామ్ మూడేళ్ల బ్రేక్ తర్వాత చేసిన మూవీ ఇది.

సమంత గుడ్ న్యూస్ ట్రెండ్

మెగాస్టార్ ఇచ్చిన సారె ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఎక్స్‌లో రకరకాలుగా స్పందిస్తున్నారు. సాధారణంగా పెళ్లయిన ఆడబిడ్డలకు లేదా ప్రెగ్నెన్సీ సమయంలో పెట్టే సారె తరహాలో ఈ గిఫ్ట్ ఉండటంతో సమంత గుడ్ న్యూస్ అనేది ట్రెండింగ్ గా మారింది. రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More