The Odyssey: నోలన్ 'ది ఒడిస్సీ' క్రేజ్ మామూలుగా లేదు.. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.1.4 లక్షలా? అసలు ఈ సినిమాలో ఏముంది?

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ ది ఒడిస్సీ క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా టికెట్లను రీసేల్ చేస్తే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంతగా ఈ మూవీలో ఏముంది? నోలన్ మూవీస్ కి ఎందుకింత క్రేజ్? ఇక్కడ చూడండి.

Published on: Jun 5, 2026, 15:02:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) పేరు చెబితే చాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్సెప్షన్ (Inception), ది డార్క్ నైట్, ఇంటర్‌స్టెల్లార్, రీసెంట్ గా వచ్చి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్‌హైమర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

The Odyssey: నోలన్ 'ది ఒడిస్సీ' క్రేజ్ మామూలుగా లేదు.. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.1.4 లక్షలా? అసలు ఈ సినిమాలో ఏముంది?
The Odyssey: నోలన్ 'ది ఒడిస్సీ' క్రేజ్ మామూలుగా లేదు.. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.1.4 లక్షలా? అసలు ఈ సినిమాలో ఏముంది?

ఆయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పటిలాగే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. కానీ ఆయన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) విషయంలో జరుగుతున్న రచ్చ మాత్రం మామూలుగా లేదు. అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.

టికెట్ ధర రూ. 1.4 లక్షలు.. ఎందుకంత పిచ్చి?

తాజా హాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా టికెట్లు ఈబే (eBay) లాంటి సైట్లలో భారీ ధరకు రీసేల్ కి వచ్చాయి. అక్కడ ఒక్కో టికెట్ ధర దాదాపు $1500 పలుకుతోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా లక్షా నలభై వేల రూపాయలు (1.4 Lakhs) అన్నమాట. ఒక సినిమా టికెట్ కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి జనాలు ఎగబడటం చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూస్తామా అని పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకింత హైప్ అంటే.. కేవలం ఇది నోలన్ సినిమా అని మాత్రమే కాదు. 'ది ఒడిస్సీ' సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ (IMAX) కెమెరాలతో షూట్ చేశారు. అందులోనూ 1.43:1 రేషియోలో 70mm IMAX స్క్రీన్ పై ఈ సినిమా చూస్తే ఆ విజువల్స్ మనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అందుకే ఆ రేంజ్ అనుభూతి కోసం జనాలకు ఎంతైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

'ది ఒడిస్సీ' అసలు కథ ఏంటి?

అసలు 'ది ఒడిస్సీ స్టోరీ' ఏంటి అని ఇప్పటి నుంచే గూగుల్ లో మనవాళ్లు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. హోమర్ (Homer) రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం 'ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు రాజు ఒడిస్సియస్ తన ఇంటికి, భార్య పెనెలోప్ దగ్గరికి చేరుకోవడానికి పడ్డ కష్టాలు, సముద్ర ప్రయాణంలో ఎదుర్కొన్న వింత జీవుల కథే ఇది. జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం

ఈ క్రేజీ ప్రాజెక్టులో నటీనటులు కూడా మామూలు వాళ్లు కాదు. మ్యాట్ డామన్ (Matt Damon), టామ్ హాలండ్ (Tom Holland), ఆన్ హాత్వే (Anne Hathaway), రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా (Zendaya), ఛార్లిజ్ థెరాన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో 'ది ఒడిస్సీ ప్రీరిలీజ్ బిజినెస్' రికార్డులు క్రియేట్ చేస్తుంటే, ఇక జులై 17న అభిమానుల హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇది కచ్చితంగా కేవలం థియేటర్లలో అందులోనూ 70mm ఐమ్యాక్స్ లో చూడాల్సిన అద్భుతం. ఇంత భయంకరమైన ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే.. థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

నెటిజన్లు తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

The Odyssey లో కథ ఏంటి?

ప్రాచీన గ్రీకు పురాణాల ఆధారంగా, ఒక రాజు పదేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత తన రాజ్యానికి తిరిగి వెళ్లే ప్రయాణంలో ఎదుర్కొనే సాహసాలే ఈ కథ.

ఈ సినిమాలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్ పాత్రలు ఏంటి?

ఇందులో ప్రధాన పాత్ర అయిన రాజు ఒడిస్సియస్ గా మ్యాట్ డామన్ నటిస్తుండగా, ఆయన కొడుకు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ కనిపించబోతున్నాడు.

ఈ సినిమా పిల్లలతో కలిసి చూడొచ్చా?

నోలన్ సినిమాలు సాధారణంగా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఇందులో యుద్ధం, యాక్షన్ సీక్వెన్స్ లు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి సెన్సార్ బోర్డు ఇచ్చే రేటింగ్ ని బట్టి పిల్లల్ని తీసుకెళ్లొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More