The Odyssey Trailer: క్రిస్టోఫర్ నోలన్ మరో అద్భుతం.. ది ఒడిస్సీ ట్రైలర్ రిలీజ్.. నెక్ట్స్ లెవెల్
The Odyssey Trailer: ది ఒడిస్సీ మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది. హాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తున్న ఈ విజువల్ వండర్ జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఓ కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
The Odyssey Trailer: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఆయన గ్రీకు పురాణగాథ 'ది ఒడిస్సీ' (The Odyssey)ని తెరకెక్కిస్తున్నారంటే ఆ ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హోమర్ రాసిన ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ మొదటి ట్రైలర్ మంగళవారం (మే 5) విడుదలైంది. హాలీవుడ్ దిగ్గజ నటులతో నిండిన ఈ ట్రైలర్ చూస్తుంటే.. నోలన్ మరోసారి వెండితెరపై ఒక మ్యాజిక్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది.
ఒడిస్సీగా మ్యాట్ డామన్.. భారీ తారాగణం
ట్రైలర్ ఆరంభం నుండి ముగింపు వరకు నోలన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రీకు వీరుడు ఒడిస్సస్ పాత్రలో హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ కనిపిస్తుండగా, యుద్ధం ముగిసిన తర్వాత పదేళ్ల పాటు సాగే ఆయన సముద్ర ప్రయాణం, స్వదేశం ఇథాకాకు చేరుకోవడానికి ఆయన పడే కష్టాలను అత్యద్భుతంగా చూపించారు.
ఈ సినిమాలో ఒడిస్సస్ భార్య పెనెలోప్ పాత్రలో ఆనె హాత్వే, ఆయన కుమారుడు టెలిమాకస్ పాత్రలో స్పైడర్ మాన్ ఫేమ్ టామ్ హాలండ్ నటించారు. పెనెలోప్‌ను వివాహం చేసుకోవాలని చూసే అంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్, నింఫ్ కాలిప్సోగా చార్లిజ్ థెరాన్ మెరిశారు. గ్రీకు పురాణాల్లోని ప్రమాదకరమైన సుడిగుండాలు, రాక్షస జీవి సైక్లోప్స్ వంటి విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి.
ఐమాక్స్ కెమెరాల మ్యాజిక్.. 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్
ఈ సినిమాను నోలన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుమారు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,000 కోట్లకు పైగా) భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా విశేషాలు ఏంటో చూడండి.
ఐమాక్స్ (IMAX): ఈ చిత్రాన్ని పూర్తిగా భారీ ఫార్మాట్ ఐమాక్స్ కెమెరాలతోనే చిత్రీకరించారు. దీని కోసం నోలన్ ఏకంగా 20 లక్షల అడుగుల ఫిలింను వాడటం గమనార్హం.
సీజీఐ (CGI) వాడకం తగ్గించి, సహజమైన లొకేషన్లలో షూట్ చేయడంలో నోలన్ దిట్ట. 'ది ఒడిస్సీ'లో కూడా అదే మాయాజాలం రిపీట్ కాబోతోంది.
ట్రోజన్ యుద్ధం తర్వాత ఒక వీరుడి ప్రయాణం, ఆయన ఎదుర్కొనే మానవాతీత శక్తుల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రం జులై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ది ఒడిస్సీ' సినిమా ఏ ఇతిహాసం ఆధారంగా రూపొందుతోంది?
గ్రీకు కవి హోమర్ రాసిన అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధమైన ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్నారు.
2. ది ఒడిస్సీ సినిమాలో నటించిన ప్రధాన నటులు ఎవరు?
మ్యాట్ డామన్ (ఒడిస్సస్), ఆనే హాత్వే (పెనెలోప్), టామ్ హాలండ్ (టెలిమాకస్), రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిజ్ థెరాన్ కీలక పాత్రల్లో నటించారు.
3. ది ఒడిస్సీ సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం 2026 జులై 16న ఆస్ట్రేలియాలో, జులై 17న అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
4. ది ఒడిస్సీ సినిమాకు ఐమాక్స్ కెమెరాలు వాడటం వల్ల లాభం ఏంటి?
ఐమాక్స్ కెమెరాలు అత్యంత స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తాయి. వెండితెరపై చూసేటప్పుడు ప్రేక్షకులు ఆ కథలోనే ఉన్నామనే అనుభూతిని కలిగిస్తాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


