The Odyssey: హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఇండియన్ సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి ఒక్క కట్ కూడా లేకుండా ప్యూర్ 'A' సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ఇండియా ప్రీమియర్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూస్ చూసి హాలీవుడ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. జులై 17న గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 172 నిమిషాలుగా లాక్ అయింది.
సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్.. వరల్డ్ వైడ్ సేమ్ వెర్షన్

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. సెన్సార్ బోర్డ్ సభ్యులు ది ఒడిస్సీ సినిమాలో ఒక్క డైలాగ్ కానీ, ఒక్క సీన్ కానీ మార్చకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కట్స్ లేకుండా ఏ వెర్షన్ రిలీజ్ అవుతుందో.. ఇండియన్ ఆడియన్స్ కూడా అదే ఒరిజినల్ కట్ థియేటర్లలో చూడబోతున్నారు.
జులై 9నే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ సెన్సార్ సర్టిఫికేట్ మేకర్స్ చేతికి వచ్చేసింది. హాలీవుడ్ స్టూడియోలు ఇండియా రిలీజ్ కోసం ఎలాంటి సెల్ఫ్ సెన్సార్‌షిప్ చేసుకోకపోవడం వల్లే ఇది సాధ్యమైంది.
అడల్ట్స్‌కు మాత్రమే..
అయితే ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ రావడంతో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే థియేటర్లలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 172 నిమిషాల 33 సెకన్లు.. అంటే దాదాపు 2 గంటల 52 నిమిషాల పాటు ఆడియన్స్‌ను నోలన్ తన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు.
గతంలో నోలన్ తీసిన 'ఓపెన్‌హైమర్' సినిమా ఇండియాలో ఏకంగా రూ.157.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ అన్ కట్ వెర్షన్ తో ఆ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ముంబై ప్రీమియర్ రచ్చ.. స్టేజ్ పై నోలన్ చిలిపి ప్రశ్నలు
ముంబైలో శుక్రవారం (జులై 10) జరిగిన ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ప్రీమియర్ ఈవెంట్లో క్రిస్టోఫర్ నోలన్ తో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ హాలండ్, మ్యాట్ డామన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు స్టేజ్ పైకి వచ్చి ఇండియన్ ఆడియన్స్ తో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారు. ముంబై ఫ్యాన్స్ చూపించిన క్రేజ్ చూసి హాలీవుడ్ స్టార్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది.
{{/usCountry}}ముంబైలో శుక్రవారం (జులై 10) జరిగిన ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ప్రీమియర్ ఈవెంట్లో క్రిస్టోఫర్ నోలన్ తో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ హాలండ్, మ్యాట్ డామన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు స్టేజ్ పైకి వచ్చి ఇండియన్ ఆడియన్స్ తో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారు. ముంబై ఫ్యాన్స్ చూపించిన క్రేజ్ చూసి హాలీవుడ్ స్టార్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది.
{{/usCountry}}స్టేజ్ పై నోలన్ చాలా సరదాగా మాట్లాడుతూ.. "నేను ముంబైకి రావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. కానీ ఇక్కడ నా సినిమాను లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రపంచంలోనే ఈ సినిమాను చూసిన ఫస్ట్ ఆడియన్స్ మీరే" అని అనడంతో థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది.
ఆ వెంటనే టామ్ హాలండ్, మ్యాట్ డామన్‌లను పక్కన పెట్టుకుని.. "ఇంతకీ మీ అందరికీ సినిమా నచ్చిందా? వీరిద్దరిలో ఎవరు బాగా యాక్ట్ చేశారు? మ్యాట్ ఆ.. టామ్ ఆ..?" అంటూ నోలన్ చిలిపిగా అడిగిన ప్రశ్నకు ఇద్దరు హీరోలు స్టేజ్ పైనే నవ్వేశారు.
ఇండియాపై నోలన్ లవ్..
ఇండియాపై తనకున్న ప్రేమాభిమానాలను నోలన్ మరోసారి బయటపెట్టాడు. గతంలో తాను జోధ్‌పూర్ లో ఒకసారి, ముంబైలో ఒకసారి షూటింగ్స్ చేశానని, ఇండియన్ ఆడియన్స్ లాంటి సినిమా నాలెడ్జ్, ఉత్సాహం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ప్రశంసల వర్షం కురిపించాడు. నోలన్ గతంలో 'ది డార్క్ నైట్ రైజెస్' కోసం జోధ్‌పూర్ లోని మెహ్రాన్‌గఢ్ కోటలో, 'టెనెట్' సినిమా కోసం ముంబై పరిసరాల్లో షూట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
గ్రీక్ ఇతిహాసంతో వస్తున్న మ్యాజిక్
హోమర్ రాసిన వరల్డ్ ఫేమస్ గ్రీక్ ఇతిహాసం ఆధారంగా 'ది ఒడిస్సీ' తెరకెక్కింది. ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత ఇతికా రాజు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన సొంత గూటికి చేరుకునే క్రమంలో ఎదుర్కొనే వింత జీవులు, రాక్షసులు, దేవుళ్లతో చేసే పోరాటమే ఈ సినిమా మెయిన్ స్టోరీ.
ఈ సినిమాలో జెండయా, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపితా న్యాంగో, ఛార్లీజ్ థెరాన్ లాంటి దిగ్గజ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ఈ సినిమా జులై 17న వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ సునామీ సృష్టించడానికి రెడీ అవుతోంది.