...
...
Next Story

The Odyssey: పిచ్చి పీక్స్.. సినిమా కోసం ప్రెగ్నెన్సీ వాయిదా.. నోలన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఐమాక్స్‌లోనే చూడాలని..

The Odyssey: ది ఒడిస్సీ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాను ఐమాక్స్ 70 ఎంఎం స్క్రీన్ లోనే చూడాలనుకుంటున్న ఫ్యాన్స్.. వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. కొందరైతే తమ ప్రెగ్నెన్సీ కూడా వాయిదా వేసుకోవడం గమనార్హం.

Published on: Jul 16, 2026, 08:48:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

The Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' (The Odyssey) విషయంలో కొందరు ఫ్యాన్స్ చూపిస్తున్న క్రేజ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. జులై 17న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ పీరియడ్ ఎపిక్ యాక్షన్ డ్రామాను IMAX 70mm ఫార్మాట్‌లో చూడటం కోసం జనాలు విమానాల్లో దేశాలు దాటి వస్తున్నారు.

ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసిన ఫ్యాన్.. ఐమాక్స్ ఫీవర్!

The Odyssey: పిచ్చి పీక్స్.. సినిమా కోసం ప్రెగ్నెన్సీ వాయిదా.. నోలన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఐమాక్స్‌లోనే చూడాలని.. (Universal Pictures via AP)
The Odyssey: పిచ్చి పీక్స్.. సినిమా కోసం ప్రెగ్నెన్సీ వాయిదా.. నోలన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఐమాక్స్‌లోనే చూడాలని.. (Universal Pictures via AP)

కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల అంబర్ కన్నాఘన్ అనే టెక్ ఎడిటర్ ది ఒడిస్సీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం కోసం తన రెండో బిడ్డను కనే ప్లాన్‌ను ఏకంగా కొన్ని నెలల పాటు వాయిదా వేసుకుంది.

"పోటీ పడి మరి టికెట్లు బుక్ చేసుకున్నాను. సినిమా రిలీజ్ టైమ్‌లో డెలివరీ ప్లాన్ ఉంటే థియేటర్‌కు వెళ్లలేనని ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేశా" అని వెల్లడించడం నోలన్ మూవీస్ పై ఉన్న ఆరాధనకు నిదర్శనం.

అలాగే పిట్స్‌బర్గ్‌కు చెందిన టిమ్ మెక్‌హ్యూ లాంటి వాళ్లు ప్రత్యేకంగా విమానంలో లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సల్ సిటీవాక్ ఐమాక్స్ థియేటర్‌కు ప్రయాణమవుతున్నారు. హైస్కూల్ రోజుల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసిన టిమ్.. ఫిల్మ్ ఫార్మాట్‌లో నోలన్ మ్యాజిక్ చూడటమే తన లైఫ్‌టైమ్ డ్రీమ్ అని చెప్తున్నాడు.

క్రాష్ అయిన వెబ్‌సైట్లు.. నేరుగా థియేటర్ల ముందు క్యూ

'ది ఒడిస్సీ' సినిమాను పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే షూట్ చేయడం హాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారి. అందుకే ఈ సినిమాను నార్మల్ డిజిటల్ స్క్రీన్స్ కంటే ఒరిజినల్ ఐమాక్స్ 70mm ఫార్మాట్‌లో చూడటానికి హాలీవుడ్ ఆడియన్స్ విపరీతంగా పోటీ పడుతున్నారు.

2023లో 'ఓపెన్‌హైమర్' సినిమాతో ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన క్రిస్టోఫర్ నోలన్.. ఆ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో 'ది ఒడిస్సీ' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్రీక్ పురాణాల్లోని ఒడిసియస్ సుదీర్ఘ సముద్ర ప్రయాణం, సైక్లోప్స్, సైరన్స్ లాంటి వింత జీవులతో చేసే పోరాటాల ఆధారంగా ఈ విజువల్ వండర్‌ను రాసుకున్నారు.

హీరోగా మ్యాట్ డామన్ నటిస్తుండగా, అతని భార్యగా ఆన్ హాత్వే, కొడుకుగా టామ్ హాలండ్ కనిపిస్తారు. ఇక మెయిన్ విలన్ ఆంటోనియస్ రోల్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించాడు. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేయడానికి 'ది ఒడిస్సీ' సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. చాలా మంది ఐదుకి ఐదు స్టార్లు ఇస్తూ మూవీని ఆకాశానికెత్తేశారు. ఇదంతా చూస్తుంటే హాలీవుడ్ లో బాక్సాఫీస్ రికార్డులన్నీ ది ఒడిస్సీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks