The Odyssey Reviews: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మాస్టర్‌పీస్ 'ది ఒడిస్సీ' థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ట్రైలర్ చూసి ఇదొక నార్మల్ వార్ డ్రామా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నోలన్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక ప్యూర్ గోతిక్ హారర్ సినిమాతో వచ్చి ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించినట్లు లేటెస్ట్ రివ్యూలు చెబుతున్నాయి. మ్యాట్ డామన్, రాబర్ట్ ప్యాటిన్సన్ తమ అద్భుతమైన నటనతో ఈ సినిమాను ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టారని చెబుతూ 5 స్టార్ రేటింగ్స్ ఇస్తుండటం విశేషం.
నోలన్ కెరీర్‌లోనే సరికొత్త ప్రయోగం

ఇప్పటివరకు 'ఇన్‌సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'ది డార్క్ నైట్', 'ఓపెన్‌హైమర్' లాంటి సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ డ్రామాలు తీసిన క్రిస్టోఫర్ నోలన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చాడు. మూడు వేల సంవత్సరాల క్రితం నాటి హోమర్ రాసిన క్లాసిక్ 'ఒడిస్సీ' కథను తన సొంత వెర్షన్ లోకి మార్చుకుని సరికొత్త సంచలనం సృష్టించాడు.
ఎపిక్ డ్రామాలను తీయడంలో నోలన్ దిట్ట అని మనకు తెలుసు. కానీ ఈ సినిమాతో తాను ఏ జోనర్ లోనైనా అద్భుతాలు సృష్టించగలనని మరోసారి నిరూపించుకున్నాడు.
ట్రోజన్ యుద్ధం తర్వాత మొదలైన భయానక ప్రయాణం
ట్రోజన్ యుద్ధం ముగిసి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇథాకా రాజు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన స్వదేశానికి తిరిగి రాడు. భర్త బతికే ఉన్నాడనే నమ్మకంతో రాణి పెనెలోప్ (ఆన్ హాత్వే) కాలం వెళ్లదీస్తుంటుంది. అయితే పెనెలోప్‌ను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని దక్కించుకోవాలని చాలామంది సూటర్స్ (suitors) ప్రయత్నిస్తుంటారు.
వారిలో అత్యంత క్రూరుడైన ఆంటోనియస్ (రాబర్ట్ ప్యాటిన్సన్) పెనెలోప్‌ను లొంగదీసుకోకముందే తన తండ్రిని వెతికి తీసుకురావాలని కొడుకు టెలిమాకస్ (టామ్ హాలండ్) సముద్ర ప్రయాణం మొదలు పెడతాడు. ఈ జర్నీలో ఎదురయ్యే ఊహించని భయానక పరిస్థితులు, ప్రాణ సంకటాలే ఈ సినిమా కథను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
రాబర్ట్ ప్యాటిన్సన్ విలనిజం.. టామ్ హాలండ్ యాక్టింగ్ హైలైట్!
ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్ తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్ ప్లే చేశాడు. కానీ అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం రాబర్ట్ ప్యాటిన్సన్. ఆంటోనియస్ అనే నెగెటివ్ క్యారెక్టర్లో అతను చూపించిన కిరాతక విలనిజం థియేటర్లలో ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తుంది.
{{/usCountry}}ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్ తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్ ప్లే చేశాడు. కానీ అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం రాబర్ట్ ప్యాటిన్సన్. ఆంటోనియస్ అనే నెగెటివ్ క్యారెక్టర్లో అతను చూపించిన కిరాతక విలనిజం థియేటర్లలో ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తుంది.
{{/usCountry}}లౌడ్ విలనిజం కాకుండా సైలెంట్‌గా ఉంటూనే తన చూపులతో భయపెట్టేలా యాక్ట్ చేశాడు. టెలిమాకస్‌గా టామ్ హాలండ్ కూడా అద్భుతమైన ఎమోషనల్ నటనతో ఆకట్టుకున్నాడు. పెనెలోప్‌గా ఆన్ హాత్వే, కాలిప్సోగా సమంతా మోర్టన్ మెప్పించారు. జెండయా, షార్లైజ్ థెరాన్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా గుర్తుండిపోయేలా నటించారు. లుపిటా న్యాంగో, ఇలియట్ పేజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
హొయ్టే విజువల్స్.. లుడ్విగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్
సినిమాటోగ్రాఫర్ హొయ్టే వన్ హొయ్టెమా ఐమ్యాక్స్ (IMAX) కెమెరాలతో క్రియేట్ చేసిన విజువల్స్ ఒక అద్భుతం. ట్రోజన్ బీచ్‌లు, సముద్రపు తుఫానుల సీన్స్ థియేటర్ పెద్ద స్క్రీన్ పై చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం.
దీనికి తోడు మన తరం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లుడ్విగ్ గోరాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ ఎఫెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. సైలెన్స్ కి, భయంకరమైన శబ్దాలకు మధ్య అతను చూపించిన మ్యూజిక్ వేరియేషన్స్ థియేటర్లలో ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టుకుని కూర్చోబెడతాయి.
యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ జర్నీ
సినిమా చివరి 30 నిమిషాల్లో నోలన్ చూపించిన డైరెక్షన్ ప్రతిభ క్లాసిక్ రేంజ్‌లో ఉంటుంది. ఒడిస్సియస్ క్యారెక్టర్‌ను ఒక అలసిపోయిన సైనికుడి నుంచి గ్రేట్ హీరోగా మార్చే సీన్లు ఎక్కడా ల్యాగ్ లేకుండా సాగిపోతాయి.
యుద్ధం సృష్టించే వినాశనాన్ని, మానవ సంబంధాలను ఎక్కడా బోర్ కొట్టించకుండా చూపించాడు. మొత్తానికి 'ది ఒడిస్సీ' సినిమాతో క్రిస్టోఫర్ నోలన్ మరో ఆల్‌టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ చెప్పినట్లు ఇది ఒక 'అబ్సల్యూట్ సినిమా'.