Cocktail 2: ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్‌ లెస్బియ‌న్ ల‌వ్‌..క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌..అమ్మాయిలు క్లోజ్ గా ఉంటే తప్పా?

Cocktail 2: షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న నటిస్తున్న మూవీ 'కాక్‌టెయిల్ 2'. అయితే ఇందులో రష్మిక మందన్న, కృతి సనన్ మధ్య లెస్బియన్ లవ్ ఉంటుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై మూవీ టీమ్ తాజాగా క్లారిటీనిచ్చింది. అదేంటో చూసేయండి.

Published on: Jun 3, 2026, 06:27:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Cocktail 2: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్ వచ్చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోడ్రన్ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే ట్రైలర్ రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో ఒక హాట్ రూమర్ తెగ హల్‌చల్ చేసింది. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక లెస్బియన్ జంటగా నటిస్తున్నారని, వారి మధ్యే మెయిన్ ట్రాక్ ఉంటుందని ప్రచారం సాగింది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ రూమర్లకు మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది

రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ రూమర్లు (PTI)
రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ రూమర్లు (PTI)

రష్మిక, కృతి సనన్ లెస్బియన్

‘కాక్‌టెయిల్ 2' సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు మూవీ టీమ్ వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచింది. ఈ క్రమంలోనే సినిమా కథపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కృతి సనన్, రష్మిక మందన్న ఇందులో లెస్బియన్ జంటగా నటిస్తున్నారని, వారి జీవితంలోకి షాహిద్ కపూర్ ఎంటర్ అవుతాడనే ప్రచారం జోరుగా సాగింది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో చిత్రబృందం తాజాగా వెల్లడించింది.

రూమర్లకు చెక్

ముంబైలో జరిగిన 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్ లాంచ్ వేడుకలో షాహిద్, కృతి, రష్మికలతో పాటు దర్శకుడు హోమీ అదజానియా, నిర్మాతలు దినేష్ విజన్, లవ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కృతి, రష్మికల పాత్రల మధ్య ఉన్న బంధం గురించి ప్రశ్నించారు. దీనిపై కృతి సనన్ సరదాగా షాహిద్ కపూర్ వైపు చూస్తూ.. "ఈ రూమర్లు అన్నీ ఒకే ఒక్క చోటు నుంచి పుడుతున్నాయని అనుకుంటున్నా" అని నవ్వేసింది.

దీనికి షాహిద్ కపూర్ కాస్త ఆశ్చర్యపోతూనే, సరదాగా స్పందించాడు. "నేనేమీ అనలేదు బాస్. కథ అలా ఉండాలని నేను ఎందుకు కోరుకుంటాను? నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?" అని చమత్కరించాడు.

అసలు ఆ రూమర్ ఎలా పుట్టిందంటే?

ఈ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ దర్శకుడు హోమీ అదజానియా అసలు నిజం బయటపెట్టాడు. "ఈ రూమర్ ఎక్కడ మొదలైందో నేనే చెప్తాను. మేమంతా షూటింగ్ సెట్‌లో కూర్చుని ఉన్నాం. కృతి, రష్మిక మంచి స్నేహితులు కావడంతో సెట్‌లో చాలా సరదాగా, క్లోజ్ గా ఉంటారు.

అది చూసి మేమంతా ఒక ఊహాజనితమైన ఆలోచన చేశాం. 'ఒకవేళ వీళ్లిద్దరి మధ్యే కథ నడిచి, షాహిద్ అందులో మూడో వ్యక్తిగా వస్తే ఎలా ఉంటుంది?' అని అనుకున్నాం. అలాంటి కథతో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదని అప్పుడు అన్నాను" అని హోమీ వివరించాడు.

లెస్బియన్ కోణం లేదు

ట్రైలర్ వేడుకకు వచ్చిన వారంతా ఈ మాటలకు నవ్వుతుండగా, నిర్మాత దినేష్ విజన్ ఈ ఊహాగానాలకు పూర్తిగా తెరదించాడు. "మేము ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ట్రైలర్‌లో చూపించినట్లు ఇందులో రెండు ప్రేమకథలు ఉన్నాయి. ఒకటి పాత ప్రేమ, ఇంకొకటి కొత్త ప్రేమ. అంతకు మించి ఈ సినిమాలో మరే ప్రేమ లేదు’’ అని క్లారిటీనిచ్చాడు.

“ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ గా ఉంటే తప్పా?”

ట్రైలర్ లాంచ్ లో షాహిద్ కపూర్ వీరిద్దరి కెమిస్ట్రీని ఉద్దేశించి సరదాగా ఆటపట్టించగా, కృతి సనన్ సమాజంలో ఉన్న మైండ్ సెట్ పై ఘాటుగా స్పందించింది. "ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే 'బ్రోమాన్స్' అని చాలా ఈజీగా అంటారు. అదే ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటే మాత్రం.. వారి మధ్య శతృత్వం అయినా ఉండాలి లేదా మరేదో నడుస్తుండాలి అని ఊహించుకుంటారు. ఈ ఆలోచనా విధానం మారాలి" అంటూ కృతి క్లారిటీ ఇచ్చింది.

గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ 'కాక్‌టెయిల్' చిత్రానికి ఇది సీక్వెల్. నాటి సినిమాలో ఇద్దరు ప్రాణస్నేహితులైన అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించే ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపించారు. ఇప్పుడు 'కాక్‌టెయిల్ 2' లో కూడా రష్మిక, కృతిల స్నేహం.. షాహిద్ కపూర్‌తో లవ్ ట్రాక్ చుట్టూనే కథ తిరగనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలోకి రానుంది.

People Also Ask (FAQ)

ప్రశ్న: కాక్‌టెయిల్ 2 సినిమాలో లెస్బియన్ లవ్ స్టోరీ ఉందా?

జవాబు: లేదు. చిత్ర దర్శకుడు హోమీ అదజానియా, నిర్మాత దినేష్ విజన్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఇది కేవలం సెట్‌లో సరదాగా అనుకున్న మాటల వల్ల వచ్చిన రూమర్ మాత్రమే.

ప్రశ్న: కాక్‌టెయిల్ 2 సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

జవాబు: ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న; కాక్‌టెయిల్ 2 సినిమాలో హీరోయిన్లు ఎవరు?

జవాబు: కాక్‌టెయిల్ 2 మూవీలో రష్మిక మందన్న, కృతి సనన్ హీరోయిన్లుగా నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More