Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, పాపులర్ స్టాండప్ కమెడియన్ కమ్ యాక్టర్ వీర్ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రివాల్వర్ రాణి’ సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కంగనాతో చేసిన ఒక బోల్డ్ కిస్సింగ్ సీన్ వల్ల వీర్ దాస్ పెదవి తెగి తీవ్రంగా గాయపడ్డాడంటూ ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ రూమర్స్ పై హీరో వీర్ దాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు నిజం ఏంటో తేల్చేశాడు.
వైరల్ గాసిప్స్‌కు చెక్ పెట్టిన వీర్ దాస్

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ సిమి చందోక్ మాట్లాడుతూ.. రివాల్వర్ రాణి షూటింగ్ టైంలో కిస్సింగ్ సీన్ ముగిసినా కంగనా ఆగలేదని, వీర్ దాస్ పెదవి గట్టిగా కొరకడంతో రక్తం వచ్చిందని కామెంట్స్ చేసింది.
ఈ రూమర్ కాస్తా విపరీతంగా ట్రోల్ అవ్వడంతో ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా వీర్ దాస్‌ను దీనిపై ప్రశ్నించాడు. దీనికి వీర్ దాస్ స్పందిస్తూ.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కేవలం ఒక కల్పిత కథ అని కొట్టిపారేశాడు.
"సెట్స్‌లో తను పూర్తి ప్రొఫెషనల్" అంటూ ప్రశంసలు
కంగనా రనౌత్ ప్రొఫెషనలిజం గురించి వీర్ దాస్ సానుకూలంగా మాట్లాడటం విశేషం. "కంగనా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. షూటింగ్ సెట్స్‌లో తను పక్కా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించింది. ఇలాంటి అబద్ధాలతో ఆమెపై బురద చల్లడం కరెక్ట్ కాదు" అని వీర్ దాస్ రాసుకొచ్చాడు.
అంతేకాదు తన కామెడీపై కంగనా గతంలో కొన్ని విమర్శలు చేస్తూ తనను టెర్రరిస్ట్ అని పిలిచినప్పటికీ.. ప్రొఫెషనల్ వర్క్ పరంగా తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చాడు.
గతంలోనే కంగనా స్ట్రాంగ్ కౌంటర్
నిజానికి ఈ కిస్సింగ్ సీన్ వివాదం సోషల్ మీడియాకు కొత్తేమీ కాదు. 2023లో కూడా ఇలాంటి పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ రూమర్స్‌పై చాలా ఘాటుగా స్పందించింది.
{{/usCountry}}నిజానికి ఈ కిస్సింగ్ సీన్ వివాదం సోషల్ మీడియాకు కొత్తేమీ కాదు. 2023లో కూడా ఇలాంటి పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ రూమర్స్‌పై చాలా ఘాటుగా స్పందించింది.
{{/usCountry}}"హృతిక్ రోషన్ తర్వాత.. ఇప్పుడు నేను పాపం వీర్ దాస్ గౌరవానికి కూడా భంగం కలిగించానా? అసలు ఇది ఎప్పుడు జరిగింది?" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ఆ గాసిప్స్ రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
కంగనా, వీర్ దాస్ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఇవే
బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ‘రివాల్వర్ రాణి’ తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ తమ కెరీర్‌లో బిజీ అయిపోయారు. వీర్ దాస్ రీసెంట్‌గా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’ సినిమాలో కనిపించాడు. ఈ మూవీ మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుని ఫస్ట్ వీక్‌లో కేవలం రూ.6.6 కోట్లు మాత్రమే రాబట్టింది.
మరోవైపు కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన ‘భారత్ భాగ్య విధాత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో 20 మంది గర్భిణీల ప్రాణాలు కాపాడిన నర్స్ గీతా మాధవ్ గాంధారే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.