Comedy Web Series: ధడక్‌పూర్ మీర్జాపూర్ అయిపోయింది.. హిట్ కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఆరోజు నుంచే..

Comedy Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో కామెడీ వెబ్ సిరీస్ దుపహియా సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ కొత్త సీజన్ ఈసారి డబుల్ ఫన్ అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

Published on: Sep 21, 2026, 18:28:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Comedy Web Series: సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ 'దుపహియా' రెండో సీజన్ ధమాకా ట్రైలర్ బయటకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొడ్యూస్ చేసిన ఈ విలేజ్ కామెడీ డ్రామా 2 నిమిషాల 35 సెకన్ల ట్రైలర్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ధడక్‌పూర్ గ్రామంలో మళ్లీ మొదలైన కొత్త గందరగోళం, నవ్వులు పూయించే సీన్లతో రూపొందిన ఈ సిరీస్ అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Comedy Web Series: ధడక్‌పూర్ మీర్జాపూర్ అయిపోయింది.. హిట్ కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఆరోజు నుంచే..
Comedy Web Series: ధడక్‌పూర్ మీర్జాపూర్ అయిపోయింది.. హిట్ కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఆరోజు నుంచే..

గతంలో నేరాలు లేని ఏకైక గ్రామంగా పేరుపొందిన ధడక్‌పూర్ ఊరిలో ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఊరి జనం మధ్య పుకార్లు, అయోమయాలు ఎంట్రీ ఇవ్వడంతో అసలు రచ్చ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ప్రతి క్యారెక్టర్ ఒక కొత్త సమస్యతో సతమతమవుతూ కనిపిస్తోంది.

ధడక్‌పూర్‌లో కొత్త కన్ఫ్యూజన్.. ఎవరి ప్రాబ్లమ్ ఏంటి?

దుపహియా 2 ట్రైలర్ చూస్తుంటే ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బన్వారీ ఝా (గజ్‌రాజ్ రావు)కి చెందిన ఖాళీ బీడు భూమిలో ఒక మొబైల్ టవర్ పెట్టే ప్రపోజల్ రావడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఆ ల్యాండ్ వల్ల ఊరిలో ఎలాంటి గొడవలు మొదలయ్యాయో సరదాగా చూపించారు.

ఇక మరోవైపు భూగోల్ (స్పర్ష్ శ్రీవాస్తవ) సోషల్ మీడియాలో అనుకోకుండా వచ్చిన పాపులారిటీ వల్ల కొత్త కష్టాల్లో పడ్డాడు. రోషిణి (శివాని రఘువంశి) తన ఎస్‌ఎస్‌సి (SSC) ఎగ్జామ్స్ కోసం తెగ ప్రిపేర్ అవుతుంటే, ఆమెకు తోడుగా అమవాస్ (భువన్ అరోరా) నిలబడ్డాడు. ఈ ట్రైలర్ చివర్లో తమ ధడక్‌పూర్ కాస్తా మీర్జాపూర్ గా మారిపోతోందన్న డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.

భోజ్‌పురి స్టార్ ఎంట్రీ.. నటీనటుల సాలిడ్ పెర్ఫార్మెన్స్

ఈ సీజన్‌లో మరో పెద్ద అట్రాక్షన్ ఏంటంటే భోజ్‌పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) స్పెషల్ క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇవ్వడం. ఆయన రాకతో కథలోకి కొత్త ట్విస్ట్‌లు రాబోతున్నాయి. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ గజ్‌రాజ్ రావు, రేణుకా షహానే తమ నాచురల్ యాక్టింగ్‌తో సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

'లాపతా లేడీస్', 'జామ్‌తారా' సిరీస్‌లతో మెప్పించిన స్పర్ష్ శ్రీవాస్తవ, అలాగే 'ఫర్జీ' సిరీస్‌లో అదరగొట్టిన భువన్ అరోరా తమ కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించారు. యశ్‌పాల్ శర్మ కూడా కీలక పాత్రలో తిరిగి వచ్చారు.

ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్

వెబ్ సిరీస్‌ను సోనమ్ నాయర్ డైరెక్ట్ చేయగా, బొంబాయి ఫిల్మ్ కార్టెల్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సలోని బైన్స్ జోషి, శుభ్ శివదాసాని నిర్మించారు. అవినాష్ ద్వివేది, చిరాగ్ గర్గ్ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా రాశారు. "గ్రామీణ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద పెద్ద కలలు, రోజువారీ జీవితంలో వచ్చే గందరగోళాల మధ్య పుట్టే హ్యూమర్‌ను ఈ సిరీస్‌లో చూపించాం" అని మేకర్స్ తెలిపారు.

తొలి సీజన్‌కి గ్లోబల్ వైడ్‌గా అద్భుతమైన రెస్పాన్స్ రాగా, ఈ రెండో సీజన్‌ అంతకుమించి ఆకట్టుకుంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. రూరల్ కామెడీ డ్రామాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్ కోసం 'దుపహియా 2' ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More