Crime Thriller OTT: పెద్ది విలన్ హీరోగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 8.1 ఐఎండీబీ రేటింగ్.. రైలు టికెట్ల స్కామ్
Crime Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రైమ్ వీడియో ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూసే వీలున్న ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
Crime Thriller OTT: ఇండియన్ రైల్వేస్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ పరేషాన్లు, దాని వెనుక నడిచే ఐటీ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ 'వెయిటింగ్ హై' (Waiting Hai) ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్‌లలో ఓటీటీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది. మీర్జాపూర్ 'మున్నా భయ్యా', పెద్ది మూవీ రాంబుజ్జి ఫేమ్ దివ్యేందు శర్మ, 'ఫర్జీ' నటుడు భువన్ అరోరా మెయిన్ లీడ్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు ఐఎండీబీలో ఏకంగా 8.1 రేటింగ్ రావడం విశేషం.

అసలేంటీ వెయిటింగ్ హై సిరీస్ స్టోరీ?
అమెజాన్ ప్రైమ్ వీడియోకు అనుబంధంగా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్ లో బుధవారం (సెప్టెంబర్ 16) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ వెయిటింగ్ హై. ఈ సిరీస్ రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది.
పాట్నాకు చెందిన అఫ్రోజ్ హమ్జా (భువన్ అరోరా) ఒక కంప్యూటర్ జీనియస్. ఇండియన్ రైల్వేస్ స్లో వెబ్‌సైట్‌లో సెకన్ల వ్యవధిలో కన్ఫర్మ్ తత్కాల్ టికెట్లు బుక్ చేసే ఒక సీక్రెట్ 'బాట్' సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాడు. అఫ్రోజ్ టాలెంట్‌ను చూసిన అతని తెలివైన మామ (విజయ్ మౌర్య) ఆ సాఫ్ట్‌వేర్‌ను ఏకంగా ఒక పెద్ద బ్లాక్ మార్కెట్ రాకెట్‌గా మార్చేస్తాడు.
కథలో మెయిన్ ట్విస్ట్.. ఆర్పీఎఫ్ ఆఫీసర్ వర్సెస్ కంప్యూటర్ హ్యాకర్
రూ. 100 తత్కాల్ టికెట్ల బిజినెస్ కొన్ని కోట్లలోకి మారడంతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఈ భారీ డిజిటల్ స్కామ్‌ను పట్టుకోవడానికి ఆర్పీఎఫ్ ఆఫీసర్ సుగం మిశ్రా (దివ్యేందు శర్మ) ఎంటర్ అవుతాడు.
ఒకవైపు నెట్‌వర్క్ హ్యాకింగ్‌తో పోలీసులకు చుక్కలు చూపించే అఫ్రోజ్, ఇంకోవైపు ఏమాత్రం క్లూ దొరక్కుండా ఛేజ్ చేసే ఆర్పీఎఫ్ ఆఫీసర్ మధ్య సాగే క్యాట్ అండ్ మౌజ్ గేమ్ ఈ వెబ్ సిరీస్‌కు అసలైన హైలైట్.
దివ్యేందు-భువన్ టైమింగ్.. పర్ఫెక్ట్ వినోదం
'మీర్జాపూర్'లో ఇంటెన్స్ యాక్టింగ్‌తో రచ్చ చేసిన దివ్యేందు శర్మ.. ఆ తర్వాత పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇందులో చాలా సీరియస్, ఫన్నీ ఆర్‌పిఎఫ్ ఆఫీసర్‌గా తన పవర్ చూపించారు. షాహిద్ కపూర్ 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లో ఫిరోజ్ క్యారెక్టర్‌తో అలరించిన భువన్ అరోరా.. ఈ సిరీస్‌లో హ్యాకర్‌గా అద్భుతంగా ఒదిగిపోయాడు. దివ్యేందు, భువన్ అరోరాల మధ్య సాగే స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.
క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో నడిచే ఈ డ్రామాలో విలన్‌గా, గైడ్‌గా విజయ్ మౌర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కుముద్ మిశ్రా సపోర్టింగ్ రోల్ కూడా కథకు మంచి బలాన్ని ఇచ్చింది.
ఈ వీకెండ్ పర్ఫెక్ట్ ఛాయిస్
ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో ఉండే మొత్తం 7 ఎపిసోడ్లు ఏమాత్రం బోర్ కొట్టకుండా చాలా క్రిస్ప్‌గా సాగుతాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో వచ్చే సస్పెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే క్యూరియాసిటీని పెంచుతుంది.
'స్కామ్ 1992', 'ఫర్జీ' తరహా వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు ఈ వీకెండ్ 'వెయిటింగ్ హై' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


