...
...
Next Story

హీరోయిన్‌గా అచ్చమైన తెలుగమ్మాయి కావలెను, గ్లామర్ కంటే దానికే ప్రాధాన్యత- కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ వెతుకులాట!

అచ్చమైన తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకునేందుకు కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ అన్వేషిస్తున్నారు. అందుకు గానూ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు సినిమాతో 15 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసిన ఆయన తెలుగు హీరోయిన్ కోసం వెతకటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Jan 29, 2026, 06:33:54 IST
Advertisement

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో దర్శకుడు యదు వంశీ టాలీవుడ్ ఆడియెన్స్ మీద చెరగని ముద్ర వేశారు. కొత్త వారితో తీసిన ఆ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం పనులు ప్రారంభించారు.

హీరోయిన్ కోసం

హీరోయిన్‌గా అచ్చమైన తెలుగమ్మాయి కావలెను, గ్లామర్ కంటే దానికే ప్రాధాన్యత- కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ వెతుకులాట!
హీరోయిన్‌గా అచ్చమైన తెలుగమ్మాయి కావలెను, గ్లామర్ కంటే దానికే ప్రాధాన్యత- కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ వెతుకులాట!

ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ కోసం ఒక యువ మహిళా నటి (హీరోయిన్) కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలోకి ప్రవేశించడానికి ఆశావహులైన నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు.

కమిటీ కుర్రోళ్లు’ మూవీతో 15 మంది కొత్త ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్న హీరో, హీరోయిన్లు తెరపైకి వచ్చారో అందరికీ తెలిసిందే. విలేజ్, రూటెడ్ కథతో వచ్చిన యదు వంశీ కమిటీ కుర్రోళ్లు మూవీ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నారు.

కమిటీ కుర్రోళ్లు పురస్కారాలు

ఇది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో అత్యున్నత గౌరవాలను అందుకుంది. దుబాయ్‌లోని గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA)లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నామినేషన్‌ను పొందింది. రూటెడ్ కథలు చెప్పాలన్న యదు వంశీ నిబద్దతను ఈ విజయాలు దృఢంగా నిలబెట్టాయి.

మన మట్టి కథల్ని చెబుతున్నప్పుడు, ఆ భావాల్ని పండించగలిగే, చూపించగలిగే ఆర్టిస్టులు ఉండాలని యదు వంశీ భావిస్తున్నారు. అందుకే మన తెలుగు వారి కోసమే యదు వంశీ ప్రయత్నిస్తున్నారు. ఆశావహులైన అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను నేరుగా బృందానికి సమర్పించవచ్చు.

yadhuvamseeYV2@gmail.com కు ఇమెయిల్ ద్వారా లేదా WhatsApp నెంబర్ 8639164104 కు వీడియోలను పంపవచ్చు. ప్రస్తుతం కాస్టింగ్ కాల్ ఆన్‌లోనే ఉంది. ఇక ఎంట్రీలను ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తూనే ఉంటారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రకటనతో

సృజనాత్మక దృష్టితో ఆలోచించి ఈ ప్రకటన చేసింది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. నిజాయితీగల ప్రతిభను ప్రోత్సహించడానికి, కంటెంట్-ఆధారిత తెలుగు సినిమాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈ ప్రకటనతో తన నిబద్ధతను చాటుకుంది.

పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే కొత్త వారికి చోటు కల్పిస్తున్నందున, ఈ కాస్టింగ్ కాల్ ఒక అర్థవంతమైన అవకాశంగా నిలుస్తుందని చాలా మంది అభిప్రాపడుతున్నారు. చాలా మంది యువ ఆశావహులకు ఇది కలల ప్రపంచమైన సినిమా ప్రయాణం వైపు మొదటి అడుగు కావచ్చు. ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన టీంతో కలిసి పని చేసే అవకాశాన్ని మిస్ కాకండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe