...
...
Next Story

Comrade Kalyan Trailer: నవ్వుల కామ్రేడ్ వచ్చేశాడు.. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్.. నక్సలైట్‌గా కామెడీయే..

Comrade Kalyan Trailer: టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో నవ్వులు పూయించే శ్రీవిష్ణు మరోసారి నవ్వుల ధమాకాతో సిద్ధమయ్యారు. ఆయన లీడ్ రోల్లో నటించిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published on: Oct 6, 2026, 18:07:08 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Comrade Kalyan Trailer: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియడ్ యాక్షన్ కామెడీ డ్రామా 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan) థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ రన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ శుక్రవారం (అక్టోబర్ 9న) సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ కట్ చేసిన ఈ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.

నక్సలైట్‌గా శ్రీవిష్ణు నవ్వుల విప్లవం.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Comrade Kalyan Trailer: నవ్వుల కామ్రేడ్ వచ్చేశాడు.. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్.. నక్సలైట్‌గా కామెడీయే..
Comrade Kalyan Trailer: నవ్వుల కామ్రేడ్ వచ్చేశాడు.. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్.. నక్సలైట్‌గా కామెడీయే..

తనదైన టైమింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్స్ కొడుతున్న శ్రీవిష్ణు.. ఈసారి నక్సలైట్ అవతారంలో అలరించనున్నారు. 1992 ఏపీ - ఒడిశా సరిహద్దు ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అయిన కళ్యాణ్ (శ్రీవిష్ణు) పోలీసుల భయం వల్ల అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి ఒక చిన్న టౌన్‌లో సీక్రెట్‌‌గా నివసిస్తుంటాడు.

తన అసలు గుర్తింపు దాచి ఫ్యామిలీతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్న కళ్యాణ్, అక్కడొక ఒరియా అమ్మాయి (మహిమా నంబియార్) ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య భాష సమస్య కావడం, ఆ సమయంలో వచ్చే కామెడీ సీన్స్ ట్రైలర్‌లో మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.

హెవీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్.. పర్ఫెక్ట్ వన్ లైనర్స్

సీరియస్ నక్సలైట్ ఇష్యూ, పోలీస్ మ్యాన్‌హంట్ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యం ఉన్నప్పటికీ, దర్శకుడు జానకీరామ్ ఈ కథను అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. శ్రీవిష్ణు మార్క్ బాడీ లాంగ్వేజ్, వన్ లైనరన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పోలీసులు తనకోసం జల్లెడ పడుతున్న సమయంలో కూడా హీరో వేసే వన్ లైనర్స్, కామెడీ పంచ్‌లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. శ్రీవిష్ణుతో పాటు సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ కాంబినేషన్ నెవర్ బిఫోర్ ఫన్ అందించబోతోందని స్పష్టమవుతోంది.

రాధికా శరత్‌‌కుమార్ రచ్చ..

కోనా వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు కథలోని మూడ్‌ను పర్ఫెక్ట్‌‌గా ఎలివేట్ చేశాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా కెమెరాలో బంధించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks