Sree vishnu: సంక్రాంతి రేస్‌లోకి శ్రీవిష్ణు ఫుల్ ఆన్ కామిడీ ఎంటర్‌టైనర్.. టైటిల్ ఇదే.. ఇంకెన్ని సినిమాలు వస్తాయో!
Sree vishnu: 2027 సంక్రాంతి రేసులోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ పండగ బరిలో దిగనుంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్.. సంక్రాంతికి రిలీజ్ అని కూడా ప్రకటించేశారు.
Sree vishnu: సంక్రాంతి 2027 ఫైట్ మహా టఫ్ గా మారుతోంది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు బరిలో నిలవగా.. తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ కూడా సై అంటోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు- శ్రీవిష్ణు కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీకి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్ పెట్టారు.

ఫ్యామిలీ ప్యాక్
ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్లతో ప్రేక్షకులను నవ్వించడంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో శ్రీవిష్ణు. అతను మరోసారి దర్శకుడు రామ్ అబ్బరాజుతో జతకట్టాడు. ఈ ఇద్దరి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మళ్లీ ఒకటైంది. ‘ఫ్యామిలీ ప్యాక్’ అంటూ ఫ్యామిలీ కామెడీ మూవీతో వీళ్లు థియేటర్లకు రాబోతున్నారు.
సంక్రాంతి రిలీజ్
వినాయక చవితి పండగ సందర్భంగా ఫ్యామిలీ ప్యాక్ టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. అలాగే మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. "సంక్రాంతి అనేది ఫ్యామిలీ కోసం.. ఈ సంక్రాంతి మన 'ఫ్యామిలీ ప్యాక్' కోసం" అనే క్యాప్షన్ తో సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నటీనటులు
తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ ఫ్యామిలీ ప్యాక్ మూవీని నిర్మిస్తోంది. శ్రీవిష్ణు సరసన సాక్షి మదోల్కర్ (Sakkshi Mhadolkar) కథానాయికగా పరిచయమవుతుండగా, కమెడియన్లు వెన్నెల కిషోర్, సుదర్శన్, ఆదిత్య చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘సామజవరగమన'కి అద్భుతమైన డైలాగ్స్ అందించిన భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి కథ-సంభాషణల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
సంక్రాంతి 2027 సినిమాలు
2027 సంక్రాంతి సినిమా రేసు ఇప్పటికే ఉత్కంఠగా మారింది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ‘మహాకాళి’ మూవీ జనవరి 8న రిలీజ్ కానుంది. ఇక సాయి దుర్గా తేజ్ చిత్రం ‘సంబరాల యేటి గట్టు’తో 2027 సంక్రాంతి సందడి షురూ కానుంది. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.
అదే రోజున అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ‘జనవరి 12 విడుదల’ కూడా థియేటర్లకు రానుంది. ఆ తర్వాత రోజు ‘కాకా’ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో చిరంజీవి థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతుంది.
ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారీతో హిట్ కొట్టిన శర్వానంద్.. 2027 సంక్రాంతికి జార్జ్ క్రిష్ గా రాబోతున్నాడు. ఈ చిత్రం జనవరి 14న విడుదలవుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


