Operation Ganga: లెనిన్ స‌క్సెస్ జోష్‌-మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ-మోహ‌న్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్‌-ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్-ఆ వార్

Operation Ganga: రీసెంట్ గా లెనిన్ మూవీతో కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకుంది అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. సక్సెస్ జోష్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మలయాళంలోకి అడుగుపెడుతోంది. అది కూడా మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో మూవీతో కావడం విశేషం. ఈ సినిమాకు తాజాగా పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. 

Published on: Sep 5, 2026, 14:27:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Operation Ganga: టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫామ్ అందుకుంది. లెనిన్ మూవీతో సక్సెస్ బాట పట్టిన ఈ భామ.. ఇప్పుడు మలయాళంలో అడుగుపెట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది భాగ్యశ్రీ. ఇవాళ (సెప్టెంబర్ 5) ఆ మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

లెనిన్ స‌క్సెస్ జోష్‌-మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ-మోహ‌న్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్‌-ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్-ఆ వార్
లెనిన్ స‌క్సెస్ జోష్‌-మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ-మోహ‌న్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్‌-ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్-ఆ వార్

ఆపరేషన్ గంగా

మలయాళ సీనియర్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా మరో కొత్త మూవీతో థియేటర్లకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘మెప్పాడియాన్’ ఫేమ్ దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సినిమా టైటిల్ ను శనివారం అనౌన్స్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు.

ఆ యుద్ధం నేపథ్యంలో

మోహన్‌లాల్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ గంగా అనే పేరుకు 'A Nation's Promise' అనేది ట్యాగ్‌లైన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు, బాంబుల వర్షం మధ్య ఉక్రెయిన్ సరిహద్దుల్లో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత్ చేపట్టిన మిషనే ‘ఆపరేషన్ గంగా’.

పవర్ ఫుల్ గా

'A Nation's Promise' అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎదురైన దౌత్యపరమైన, సైనిక, మానవ సవాళ్లను విజువల్ వండర్‌గా ఆవిష్కరించనుంది. మోహన్‌లాల్ ఈ మిషన్‌ను ముందుండి నడిపించే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.

భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ!

మోహన్‌లాల్ తో పాటు ఈ ఆపరేషన్ గంగా సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అర్జున్ రాంపాల్, సీనియర్ నటుడు పార్థిబన్, వర్సటైల్ యాక్టర్ ఆదిల్ హుస్సేన్ అత్యంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల ‘లెనిన్’ తో హిట్ అందుకున్న హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటుడి పక్కన భాగ్యశ్రీకి అవకాశం దక్కడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా మారనుంది.

భారీ ఓపెనింగ్స్

మలయాళ సినిమాలు నేచురల్ గా ఉంటాయనేది టాక్. ఈ 'ఆపరేషన్ గంగా' ద్వారా శ్రీ గోకులం మూవీస్ బిగ్ బడ్జెట్ విజువల్ క్యాన్వాస్‌ను ఆవిష్కరిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ అంశం వరల్డ్ వైడ్ గా పాపులర్. ఈ నేపథ్యంలో మలయాళంలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఆపరేషన్ గంగా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More