Bhagrashri Borse: హీరోయిన్ ను ఎందుకు బ్లేమ్ చేస్తారు?.. ఐరన్ లెగ్ కామెంట్లపై భాగ్యశ్రీ బోర్సే సంచలన కౌంటర్.. హిట్ తో!
Bhagrashri Borse: ‘లెనిన్’ చిత్రంతో కెరీర్‌లో తొలి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఇంతకాలం తనపై వచ్చిన ‘ఐరన్ లెగ్’ ట్రోల్స్‌పై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చింది. సినిమా ఫ్లాప్ లకు హీరోయిన్లను ఎందుకు బ్లేమ్ చేస్తారని ప్రశ్నించింది.
Bhagrashri Borse: ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడి రాతనో, హీరో మార్కెట్‌నో కాకుండా.. హీరోయిన్ జాతకాన్ని బ్లేమ్ చేసే విచిత్రమైన సాంప్రదాయం మూవీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఇక వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. తాజాగా ఈ విషయంపై భాగ్యశ్రీ బోర్సే సంచలన వ్యాఖ్యలు చేసింది.

భాగ్యశ్రీ బోర్సే కామెంట్లు
కెరీర్ స్టార్టింగ్ లో నటించిన సినిమాలు వరుసగా నిరాశపరచడంతో భాగ్యశ్రీ బోర్సేను ఐరన్ లెగ్ అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అఖిల్ హీరోగా వచ్చిన 'లెనిన్' ఘనవిజయంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజాగా వెరైటీ ఇండియాతో ఇంటర్వ్యూలో ఐరన్ లెగ్ అనే కామెంట్లపై భాగ్యశ్రీ బోర్సే ఓపెన్ గా మాట్లాడింది.
మాకేం కంట్రోల్ ఉంటుంది?
ఐరన్ లెగ్ అనే ట్యాగ్ తనను ఎప్పుడూ బాధించలేదని, కానీ చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని భాగ్యశ్రీ పేర్కొంది. "సినిమా అనేది వందల మంది కలిసి చేసే ఒక టీమ్ వర్క్. ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి హీరోయిన్‌ను ఎలా బాధ్యురాలిని చేస్తారు? స్క్రిప్ట్‌లో జరిగే మార్పులపై కానీ, ఎడిటింగ్ రూమ్‌లో తీసుకునే నిర్ణయాలపై కానీ, క్రియేటివ్ యాస్పెక్ట్స్‌పై కానీ మాకు ఎలాంటి కంట్రోల్ ఉండదు కదా!" అంటూ పక్కా లాజికల్ పాయింట్‌ను లేవనెత్తింది.
శ్రుతి హాసన్, శ్రీలీల, తాప్సీల దారిలోనే..
ఈ సందర్భంగా పరిశ్రమలోని సీనియర్ టాప్ హీరోయిన్ల ఉదాహరణలను భాగ్యశ్రీ ప్రస్తావించింది. తాప్సీ పన్ను, శ్రుతి హాసన్, శ్రీలీల వంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి 'ఐరన్ లెగ్' విమర్శలను, బ్యాడ్ ఫేజ్‌ను ఫేస్ చేసినవారేనని గుర్తు చేసింది.
వారంతా ఆ అడ్డంకులను దాటుకుని, తమ ప్రతిభతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకున్నారని.. తాను కూడా అదే పట్టుదలతో నిలబడ్డానని స్పష్టం చేసింది. సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది ఒక్కరి వల్లే సాధ్యం కాదని, ఇప్పుడు 'లెనిన్' హిట్ అయినంత మాత్రాన క్రెడిట్ అంతా తనకే రాదని చాలా మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చింది.
క్యూ కడుతున్న ఆఫర్లు
టాలీవుడ్ ట్రేడ్ ఈక్వేషన్లను గమనిస్తే.. హీరోలకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వస్తే దాన్ని 'బ్యాడ్ టైమ్' అంటారు. అదే హీరోయిన్లకు వస్తే 'ఐరన్ లెగ్' అని లేబుల్ వేస్తారనే టాక్ ఉంది. గతంలో శ్రుతి హాసన్ వరుస ఫ్లాపుల తర్వాత పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిందో.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ 'లెనిన్' సినిమాతో సరిగ్గా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసింది.
ఈ సక్సెస్ తర్వాత భాగ్యశ్రీకి టాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఒక సింగిల్ హిట్ సినిమా పరిశ్రమ పర్సెప్షన్‌ను, హీరోయిన్ బ్రాండ్ వాల్యూను ఎలా మార్చేస్తుందనేదానికి భాగ్యశ్రీ లేటెస్ట్ కెరీర్ గ్రాఫే నిదర్శనం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


