Akhil Fan: వాట్ ఏ వీడియో.. ‘అయ్యగారే నంబర్ వన్’ ఫ్యాన్ ను కలిసిన అఖిల్.. గట్టిగా హగ్ చేసుకుని మరీ ప్రామిస్.. వైరల్
Akhil Fan: అక్కినేని అఖిల్ తన మోస్ట్ ఫేమస్ "అయ్యగారే నంబర్ వన్" ఫ్యాన్ నాగరాజును పర్సనల్‌గా కలిసి సర్ప్రైజ్ ఇచ్చాడు. బ్లాక్‌బస్టర్ ‘లెనిన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న అఖిల్.. తన ఫ్యాన్‌ను గట్టిగా హగ్ చేసుకుని మరో భారీ హిట్ ఇస్తానని ప్రామిస్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
Akhil Fan: టాలీవుడ్‌లో ఒక వైరల్ మీమ్ లేదా ఫ్యాన్ స్లోగన్.. ఒక హీరో ఇమేజ్‌ను ఏ రేంజ్‌లో మార్చగలదనే దానికి అక్కినేని అఖిల్ తాజా సంఘటనే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. గతంలో అఖిల్ సినిమాల రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా బుల్లితెరపై, సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించిన ట్యాగ్‌లైన్ "అయ్యగారే నంబర్ వన్". ఈ స్లోగన్‌ను ట్రెండ్ చేసిన ఫేమస్ ఫ్యాన్ నాగరాజును అఖిల్ రీసెంట్‌గా కలవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అఖిల్ గట్టి హగ్
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తనను ప్రాణంగా అభిమానించే నాగరాజును అక్కినేని అఖిల్ పిలిపించుకున్నాడు. గుంటూరులో లెనిన్ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా తన ఫ్యాన్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్‌ను చూడగానే నాగరాజు తన ఎమోషన్స్ ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం చూసిన వారందరినీ కదిలిస్తోంది. అఖిల్ కాళ్ల మీద పడిపోయిన నాగరాజును పైకి తీసుకున్నాడు హీరో. గట్టిగా హగ్ ఇచ్చాడు.
వైరల్ వీడియో
అఖిల్ ఆ ఎమోషనల్ మూమెంట్‌లో తన ఫ్యాన్‌ను చాలా గట్టిగా హగ్ చేసుకుని సంతోషపడటం అక్కినేని అభిమానులకు ఒక కంటి పండుగలా నిలిచింది. ఒకప్పుడు కేవలం ట్రోల్స్ లేదా మీమ్స్ కోసం వాడిన "అయ్యగారే నంబర్ వన్" అనే మాటను.. నాగరాజు ఎంతో జెన్యూన్‌గా ఓన్ చేసుకున్నాడు. ఆ నమ్మకానికి అఖిల్ ఇచ్చిన ఈ గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
అఖిల్ ఇచ్చిన క్రేజీ ప్రామిస్!
గతంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన అఖిల్‌కు రీసెంట్‌గా వచ్చిన ‘లెనిన్’ (Lenin) చిత్రం కెరీర్ బెస్ట్ మైల్‌స్టోన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, అఖిల్ లోని అసలైన నటుడిని మాస్ ఆడియన్స్‌కు పరిచయం చేసింది.
ఈ సక్సెస్ తెచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే నాగరాజుతో మాట్లాడిన అఖిల్.. హ్యాపీనా అని అడిగాడు. ‘‘చాలా హ్యాపీ సార్’’ అని నాగరాజు చెప్పాడు. ‘‘నీ వల్లే ఈ సారి ఇంకోటి కొడదాం’’ అని వెంటనే అఖిల్ అన్నాడు. ‘‘కచ్చితంగా కొట్టాలి. ఇంకా పైకి వెళ్లిపోవాలి’’ అని నాగరాజు కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పాడు.
బ్లాక్ బస్టర్ లెనిన్
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కెరీర్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసినా అతనికి సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అఖిల్ కు ఇదే ఫస్ట్ సాలిడ్ హిట్. దీంతో అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


