బొడ్డు మీద ఫోకస్..ప్యాడెడ్ బ్రాలు..సౌత్ దర్శకుల కోరికలపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు..ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించండంటూ!

బాలీవుడ్ లో ఇప్పుడు బిజీ అయిపోయిన స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ల ఫాంటసీలపై హాట్ కామెంట్లు చేసింది. బొడ్డుపై ఫోకస్ పెడతారని, సైజ్ లు పెద్దగా కనిపించేలా ప్యాడెడ్ బ్రాలు వేసుకోమ్మని ఫోర్స్ చేస్తారని తాప్సీ పేర్కొంది.  

Published on: Feb 22, 2026, 16:20:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. తాజాగా ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన అస్సీ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సౌత్ డైరెక్టర్లపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

తాప్సీ పన్ను
తాప్సీ పన్ను

తాప్సీ ప్యాడెడ్ బ్రా

ఫిబ్రవరి 20న తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించిన హిందీ మూవీ అస్సీ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సౌత్ సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు హీరోయిన్లు ఎదుర్కొనే ఇబ్బందికరమైన నిజాల గురించి తాప్సీ హాట్ కామెంట్లు చేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో దర్శకులు హీరోయిన్ల సైజులు పెంచడం కోసం ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని ఫోర్స్ చేస్తారని తాప్సీ బాంబ్ పేల్చింది.

బొడ్డుపై ఫోకస్

యూట్యూబ్‌లో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తాప్సీ మాట్లాడుతూ ఈ సంచలన కామెంట్లు చేసింది. భోజ్‌పురి, సౌత్ ఇండియన్ సినిమాల్లో పాటల సన్నివేశాల్లో బొడ్డుపై ఎందుకు ఫోకస్ చేస్తారని తాప్సీని హోస్ట్ అడిగాడు. ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకోవడానికి తాను కూడా ప్రయత్నించానని తాప్సీ పేర్కొంది. చాలా సౌత్ సినిమాలు తమ విజువల్ ఫ్రేమింగ్‌లో బొడ్డును ఫోకస్ చేయడానికి మొగ్గు చూపుతాయని, హిందీలోనేమో క్లీవేజ్ పై దృష్టి పెడతారని తాప్సీ చెప్పింది.

సౌత్ లో ఇలా

"సౌత్‌లో కూడా ప్యాడెడ్ బ్రాలు ధరించమని చెబుతారు. సెట్‌లో డైరెక్టర్ ఎవరికి ఈ విషయం చెప్పాలి? అన్నదే ఇక్కడ ముఖ్యమైన సమస్య. ఎందుకంటే సెట్‌లో ఒకరు లేదా ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి డైరెక్టర్ ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెబుతారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో స్టైలింగ్ టీమ్‌కు లేదా హెయిర్ టీమ్‌లోని అక్కకు చెబుతారు. చివరకు ఆ మెసేజ్ హీరోయిన్ కు చేరుతుంది’’ అని తాప్సీ వెల్లడించింది.

తేడా వచ్చిందా?

"సెట్‌లో ఒక పాట షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా ధరించమని చెప్పినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు మధ్యలో ఎవరో ఒకరు లేచి హీరోయిన్ దగ్గరకు వెళ్తారు. సైజ్ లో తేడా వచ్చిందో లేదో అని చూస్తారు. తేడా తెలియడం లేదని ఎవరైనా చెప్తే మళ్లీ మార్చుకుని రమ్మంటారు’’ అని తాప్సీ తెలిపింది.

హైలైట్ చేయడానికి

సౌత్ దర్శకులు తరచుగా స్క్రీన్‌పై నిర్దిష్ట శరీర భాగాలను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రేక్షకుల ఫాంటసీలు, విజువల్ అప్పీల్‌ను తీరుస్తుందని తాప్సీ అభిప్రాయపడింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More