రామ్‌చరణ్ పెద్ది సినిమా వివాదం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి ఆ పదాలు!

రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలోని కొన్ని పదాలు గిరిజనుల మనోభావాలను దెబ్బతీశాయని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి ఆ పదాలు వస్తాయని చెబుతున్నాయి.

Published on: Jun 16, 2026, 14:42:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ట్రైబల్ రైట్స్ (విజయనగరం జిల్లా) అధ్యక్షుడు తుమ్మి అప్పల రాజు దొర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రామ్‌చరణ్ పెద్ది సినిమా వివాదం
రామ్‌చరణ్ పెద్ది సినిమా వివాదం

విజయనగరం జిల్లా ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)కు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. పెద్ది చిత్రంలో ఉపయోగించిన ‘కొండన కొడకా’ వంటి పదాలు గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయన్నారు. అందువల్ల ఆ పదాలను సినిమా నుండి తక్షణమే తొలగించేలా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు స్వయంగా కలిసి ఒక సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు.

'సమాజంలో ఇటువంటి అవమానకరమైన పదాల వాడకంపై చట్టపరమైన నిషేధం ఉంది. గిరిజనులను కించపరిచేలా మాట్లాడటం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (Prevention of Atrocities) చట్టం, 1989 ప్రకారం నేరం. ఇటువంటి డైలాగులు ఉంచితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అని అప్పలరాజు దొర ఈ సందర్భంగా హెచ్చరించారు.

సినిమాలు సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని గిరిజన నాయకులు పేర్కొన్నారు. వినోదం పేరుతో వెనకబడిన వర్గాలను లేదా గిరిజన సంస్కృతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. సెన్సార్ బోర్డు ఇటువంటి సున్నితమైన అంశాలను నిశితంగా పరిశీలించి, వివాదాస్పద సన్నివేశాలకు, డైలాగులకు కత్తెర వేయాలని కోరారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూరల్ డ్రామా నేపథ్యంతో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాల నుంచి వచ్చిన ఈ అభ్యంతరాలపై చిత్ర యూనిట్ లేదా దర్శకుడు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ది మూవీ కలెక్షన్లలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్లు క్రాస్ చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More