కిస్ అర్థం చెప్పిన కపుల్ ఫ్రెండ్లీ హీరోయిన్ మానస వారణాసి.. రిపోర్టర్ ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్

మాజీ మిస్ ఇండియా మానస వారణాసి యాక్టింగ్ లోనే కాదు మాటల్లోనూ చురుకే. కపుల్ ఫ్రెండ్లీ మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టిన ఈ భామ.. తాజాగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. కిస్ అంటే ఏంటో పర్ఫెక్ట్ అర్థం చెప్పింది. 

Feb 18, 2026, 13:42:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. అందంతో పాటు అభినయంతోనూ ఫ్యాన్స్ ను మెప్పిస్తోంది. మరోవైపు మాటల్లోనూ చురుకే అని నిరూపించుకుంది. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మానస ఆన్సర్ తెగ వైరల్ గా మారింది.

మానస వారణాసి (x/varanasi_manasa)
మానస వారణాసి (x/varanasi_manasa)

కిస్ అంటే

కపుల్ ఫ్రెండ్లీ మూవీలో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మానసకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘ఈ సినిమాలో కిస్ సీన్లు ఉన్నాయి కదా. అసలు కిస్ అంటే ఏంటీ? కాస్త వివరించండి’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు. కిస్ అంటే సాధారణంగా ఏమని వివరిస్తామనే అంతా ఆలోచిస్తారు. కానీ మానస మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మానస ఆన్సర్

రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మానస వారణాసి ఇచ్చిన కౌంటర్ నెట్టింట ప్రశంసలు అందుకుంటుంది. కిస్ అంటే ఇంగ్లీష్ లో KISS. ఇదే అర్థం వచ్చేలా.. Keep It Short And Simple అని మానస వారణాసి కేఐఎస్ఎస్ కు అర్థం చెప్పింది. అలాగే షార్ట్ గా, సింపుల్ గా ఉండాలంటూ కిస్ మీనింగ్ ను పర్ఫెక్ట్ గా చెప్పిందనే కామెంట్లు వస్తున్నాయి. ఆ ఆన్సర్ చెప్పిన తర్వాత మానస నవ్వుకుంది. పక్కనే ఉన్న సంతోష్ శోభన్ ఏం చెప్పావ్ అసలు అంటూ క్లాప్స్ కొట్టాడు.

మానస వారణాసి గురించి

మానస వారణాసిది హైదరాబాదే. ఈ భామ ఇక్కడే వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసింది. 2020లో మిస్ ఇండియాగా నిలిచింది. అదే ఏడాది మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది. మహేష్ బాబు మేనళ్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో మానస డెబ్యూ చేసింది. ఈ’ మూవీ 2024లో రిలీజైంది.

కపుల్ ఫ్రెండ్లీ

రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మానస వారణాసి ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇందులో సంతోష్ శోభన్ హీరో. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. దీనికి అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. కపుల్ ఫ్రెండ్లీ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో సాగిపోతుంది. ఇందులో రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు, సునీల్ రెడ్డి తదితరులు కూడా నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More