ఎమోషనల్ థ్రిల్లర్ కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది.
హైకు ఫస్ట్ లుక్

నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అరుళనందు పుట్టినరోజు (డిసెంబర్ 5) సందర్భంగా హైకు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైకు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. దీంతో హైకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇకపోతే హైకు సినిమాను తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. అలాగే, ‘హైకూ’ చిత్రంలో ఏగన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటు కోర్ట్ మూవీ ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల ప్రధాన పాత్ర పోషిస్తంది. కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటిస్తున్న తొలి తమిళ, మలయాళ సినిమా ఇది.
రొమాంటిక్ డ్రామాగా
శ్రీదేవి అపల్లతోపాటు మిన్నల్ మురళి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్ కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమిస్తే.. ఈ సినిమా రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది.
యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు, వారు కనే కలల నేపథ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా హైకు రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మనకు కనిపిస్తున్నారు.
వారి మధ్య చక్కటి కెమిస్ట్రీ మనకు పోస్టర్లో అందంగా కనిపిస్తోంది. ఆకాశంలో కనిపించే లవ్ సింబల్ టైటిల్‌ను సూచించే సున్నితమైన భావాన్ని తెలియజేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుకగా కనిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోషనల్ జర్నీని సూచిస్తోంది.
చిన్నసామి దర్శకత్వం
{{/usCountry}}వారి మధ్య చక్కటి కెమిస్ట్రీ మనకు పోస్టర్లో అందంగా కనిపిస్తోంది. ఆకాశంలో కనిపించే లవ్ సింబల్ టైటిల్‌ను సూచించే సున్నితమైన భావాన్ని తెలియజేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుకగా కనిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోషనల్ జర్నీని సూచిస్తోంది.
చిన్నసామి దర్శకత్వం
{{/usCountry}}ఇదిలా ఉంటే హైకు సినిమాకు యువరాజ్ చిన్నసామి రైటర్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన యూత్‌కు కనెక్ట్ అయ్యేలా యూనిక్ స్టోరీ నెరేషన్‌తో ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. హరిహరన్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. అదిర్చి అరుణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
బేబి, కోర్ట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ హైకు సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. హృదయాన్ని హత్తుకునేలా, ఎమోషనల్ కంటెంట్ కనెక్ట్ అయ్యే సంగీతాన్ని ఆయన అందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
జో, కోళి పన్నై చెల్ల దురై చిత్రాల అందించిన విజన్ సినిమా హౌస్ తన బ్యానర్‌లో రూపొందిస్తోన్న మూడో చిత్రమిది. యంగ్ టాలెంట్‌ను, ఆలోచనలను ఎంకరేజ్ చేస్తూ మరోసారి ఈ నిర్మాణ సంస్థ వైవిధ్యమైన సినిమాతో మన ముందుకు రానుంది.
హృదయాన్ని హత్తుకునే ఎలిమెంట్స్
ప్రేమలోని పవిత్రత, అందమైన స్నేహం, మనల్ని మనం కనుగొనే ప్రయాణం వంటి హృదయాన్ని హత్తుకునే ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ, సరికొత్త కథ, కథనాలతో సినిమాలను రూపొందిస్తోన్న డాక్టర్ అరుళనందుకి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయటం ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేసింది.