...
...
Next Story

50 లక్షల మంది యూజర్ల డేటా, 21 వేలకుపైగా సినిమాలు, 20 కోట్ల సంపాదన.. ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు!

పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఐ బొమ్మ ఇమ్మడి రవి దగ్గర సుమారుగా 50 లక్షల మంది యూజర్ల డేటా ఉందని, 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని సీపీ సజ్జనార్ తెలిపారు. ఐ బొమ్మ రవి కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: Nov 17, 2025, 15:06:09 IST
Advertisement

అతిపెద్ద పైరసీ వెబ్‌సైట్‌గా పేరు తెచ్చుకున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ ఆర్గానైజర్‌ ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఐ బొమ్మ రవి సంచలన విషయాలు

50 లక్షల మంది యూజర్ల డేటా, 21 వేలకుపైగా సినిమాలు, 20 కోట్ల సంపాదన.. ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు
50 లక్షల మంది యూజర్ల డేటా, 21 వేలకుపైగా సినిమాలు, 20 కోట్ల సంపాదన.. ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు

ప్రస్తుతం ఐ బొమ్మ రవి జైల్లో ఉన్నాడు. ఇమ్మడి రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ తాజాగా సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మడి రవి కేసు, పైరసీపై సీపీ సజ్జనార్ సంచలన నిజాలు బయటపెట్టారు.

పైరసీతో 20 కోట్ల సంపాదన

ఐ బొమ్మ ఇమ్మడి రవి నుంచి స్వాధీన పరుచుకున్న హార్డ్ డిస్క్‌లలో సుమారు 21 వేలకుపైగా సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్ల వరకు సంపాదించాడని పేర్కొన్నారు. అందులో రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా సీపీ సజ్జనార్ వెల్లడించారు.

డేటా కలెక్షన్ కోసం

అంతేకాకుండా ఇమ్మడి రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని, ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని చెప్పారు సీపీ సజ్జనార్. ఐ బొమ్మ రవి దగ్గర దాదాపుగా 50 లక్షల మంది సమచారాం ఉందని ఆయన వెల్లడించారు. డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని సీపీ సజ్జనార్ వివరించారు.

3 పైరసీ కేసులు, సీక్రెట్ కెమెరాలతో

ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే మరో వెబ్‌సైట్‌ను ఐ బొమ్మ ఇమ్మడి రవి డెవలప్ చేస్తాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. రవి క్రియేట్ చేసిన సైట్ ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ చేస్తాయని, బెట్టింగ్ యాప్స్‌తో ప్రజలు వేల కోట్లు నష్టపోయారని సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

మిగతా వారిని కూడా

అయితే, ఐ బొమ్మ ఇమ్మడి రవిని కస్టడీకి ఇస్తే అతని నుంచి పూర్త వివరాలు రాబడతామని, రవి నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కరేబేయిన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ సైట్‌ను ఇమ్మడి రవి నడిపించిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe