ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్- కరేబియన్ దీవుల్లో నిర్వహణ- విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇమ్మడి రవి- 3 కోట్లు సీజ్!

ఓటీటీలకు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిన ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇమ్మడి రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. దమ్ముంటే తమను పట్టుకోండి అని పోలీసులకు ఐ బొమ్మ టీమ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Published on: Nov 15, 2025, 12:37:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అటు ఓటీటీలకు, ఇటు సినీ నిర్మాతలకు చుక్కలు చూపించిన అదిపెద్ద పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను, వెబ్ సిరీస్‌లను పైరసీ చేస్తూ ఐ బొమ్మ ప్రస్తుతం (బప్పమ్ టీవీ) వెబ్‌సైట్‌లో ఇమ్మడి రవి పోస్ట్ చేస్తుండేవాడు.

ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్- కరేబియన్ దీవుల్లో నిర్వహణ- విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇమ్మడి రవి- 3 కోట్లు సీజ్!
ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్- కరేబియన్ దీవుల్లో నిర్వహణ- విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇమ్మడి రవి- 3 కోట్లు సీజ్!

ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలోని

అటు థియేటర్లలో విడుదలైన సినిమాలతోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలోని మూవీస్, వెబ్ సిరీస్‌లను అదే రోజున క్వాలిటీతో పైరసీ చేసి సైట్‌లో పెట్టడం ఐ బొమ్మ స్పెషలాటి అని తెలిసిందే.

ఇన్నేళ్లు పైరసీ సినిమాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం (నవంబర్ 15) ఉదయం కూకట్‌పల్లిలో సీఎస్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో

నిన్న (నవంబర్ 14) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇన్నేళ్లు కరెబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను ఇమ్మడి రవి నిర్వహించినట్లు పోలీసులు నిర్దారించారు.

అయితే, వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన సినిమాలను అదే రోజు ఐ బొమ్మలో పెట్టడంతో ఈ సైట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త సినిమాల రిలీజ్ ఉన్న ప్రతిసారి నిర్మాతలు ఈ వెబ్‌సైట్ గురించి ప్రస్తావించేవారు. అలాగే, పోలీసులకు నిర్మాతల మండలి ఫిర్యాదు కూడా చేసేది.

ఐదుగురు సభ్యుల ముఠా

ఈ మధ్య కాలంలో ఐ బొమ్మ ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం కీలకమైన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అప్పటి సీపీ సీవీ ఆనంద్ పైరసీ వెబ్‌సైట్స్ ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించినా సరే పట్టుకుంటామని ధీమాగా చెప్పారు.

ముఖ్యంగా ఐ బొమ్మ వంటి సైట్స్‌ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు సీపీ సీవీ ఆనంద్. పోలీసుల వార్నింగ్ తర్వాత ఐ బొమ్మ వారికి సవాల్ విసిరింది. దమ్ముంటే తమను పట్టుకోమ్మని, తమను పట్టుకుంటే ఎవరిని ఎక్కడ ఫోకస్ చేయాలో బాగా తెలుసు అని, తమ దగ్గర చాలా మంది ప్రైవేట్ డాటా ఉందని బెదిరింపులకు పాల్పడింది.

మరింత సీరియస్‌గా

ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇన్ని రోజులు విచార జరిపి కీలక నిందితుడుని అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, ఫ్రాన్స్‌లో కూడా ఉంటూ సినిమాలను వెబ్‌సైట్‌లో పెట్టెవారు.

ఇకపోతే ఐ బొమ్మ నిర్వాహకుడు అయిన ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరింపజేసుకున్నాడు. ఎక్కువగా కరేబియన్ దీవుల నుంచి మ్యానేజ్ చేసేవాడు.

3 కోట్ల రూపాయలు ఫ్రీజ్

ఇమ్మడి రవి నుంచి లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన వివరాలు, ప్రింట్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే, రవి అకౌంట్‌‌లో ఉన్న రూ. 3 కోట్లను కూడా ఎలాంటి లావాదేవీలు జరపకుండా అధికారులు నిలిపివేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More