OTT Crime Thriller: బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘమాసాన్' (Ghamasaan) అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ పవర్‌ఫుల్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంటెన్స్ డ్రామా జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
బుందేల్‌ఖండ్ బ్యాక్‌డ్రాప్‌లో పోలీస్ vs దొంగల ఫైట్

హిందీ హార్ట్‌ల్యాండ్ అయిన బుందేల్‌ఖండ్ లోయల నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ సాగుతుంది. చట్టం, నేరం మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోయిన చోట ఒక పోలీస్ ఆఫీసర్, తిరుగుబాటుదారుడైన నేరస్థుడి మధ్య జరిగే ప్రాణాంతకమైన పోరాటమే ఈ 'ఘమాసాన్'. తెలుగులో ఘమాసాన్ అంటే పెనుగులాట అని అర్థం.
'స్కామ్ 1992' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో ఆదిత్య అనే నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. మరోవైపు 'అసుర్', 'మున్నాభాయ్' చిత్రాల ఫేమ్ అర్షద్ వార్సీ 'మహారాజ్' అనే దారుణమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.
అర్షద్ వార్సీ మైండ్ బ్లాకింగ్ విలనిజం
ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ, పాజిటివ్ రోల్స్‌లో అలరించిన అర్షద్ వార్సీ ఈ సినిమాలో పూర్తిగా డార్క్ అండ్ రా లుక్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లో ఇంత డార్క్, అసలు ఊహకందని బాడీ లాంగ్వేజ్ ట్రై చేయడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు.
మరోవైపు ప్రతీక్ గాంధీ కూడా చట్టాన్ని కాపాడటానికి వ్యవస్థతో పోరాడే ఆఫీసర్‌గా చాలా ఇంటెన్స్‌గా అలరించారు. కేవలం ఒక పోలీస్ - విలన్ గొడవలా కాకుండా, ఆధిపత్యం, రాజకీయాలు, మనుగడ కోసం జరిగే వేటగా దర్శకుడు దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఇషితా దత్తా కూడా ఒక కీలకమైన రోల్ చేశారు.
దిగ్గజ దర్శకుడి మార్క్.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ హడావుడి
'పాన్ సింగ్ తోమర్', 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్' లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలను తెరకెక్కించిన తిగ్మాన్షు ధులియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రా అండ్ రియలిస్టిక్ టేకింగ్‌కు పేరుగాంచిన తిగ్మాన్షు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
{{/usCountry}}'పాన్ సింగ్ తోమర్', 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్' లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలను తెరకెక్కించిన తిగ్మాన్షు ధులియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రా అండ్ రియలిస్టిక్ టేకింగ్‌కు పేరుగాంచిన తిగ్మాన్షు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
{{/usCountry}}ఓటీటీ రిలీజ్‌కు ముందే ఈ సినిమా అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. మామి (MAMI) ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, సినెవెస్చర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా.. విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.
సెప్టెంబర్ 11న జీ5లో ధమాకా
జియో స్టూడియోస్ నిర్మించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మంచి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ సెప్టెంబర్ 11న జీ5లో రాబోతున్న 'ఘమాసాన్' పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది. డిఫరెంట్ కంటెంట్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.