...
...
Next Story

సన్నీ లియోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారే మాజీ పోలీసు

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కెన్నెడీ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, జియో మామి వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించిన ఈ సినిమా.. దాదాపు మూడేళ్ళ తర్వాత నేరుగా జీ5 ఓటీటీలో విడుదల కానుంది.

Published on: Jan 30, 2026, 17:21:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’ (Kennedy) సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు గుడ్ న్యూస్. 2023లో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించినా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకే వస్తుండటం విశేషం.

కెన్నెడీ ఓటీటీ రిలీజ్ డేట్

సన్నీ లియోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారే మాజీ పోలీసు
సన్నీ లియోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారే మాజీ పోలీసు

బాలీవుడ్ లో విలక్షణమైన మూవీస్ ఎన్నో డైరెక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కెన్నెడీ రూపంలో అలాంటిదే మరో మూవీని ప్రేక్షకులకు అందించాడు. ఈమధ్యే ముంబై వదిలేసి సౌత్ సినిమాల్లో నటుడిగా అవకాశాలు వెతుక్కుంటున్న అనురాగ్ క్రియేట్ చేసిన మరో క్రైమ్ వరల్డ్ ఈ కెన్నెడీ. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సన్నీ లియోనీ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.

కెన్నెడీ స్టోరీ, ఇతర విశేషాలు

కెన్నెడీ మూవీ ఒక నియో-నాయిర్ (Neo-noir) క్రైమ్ థ్రిల్లర్. ఉదయ్ శెట్టి (రాహుల్ భట్) అనే మాజీ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని అందరూ అనుకుంటారు. కానీ అతను 'కెన్నెడీ' అనే పేరుతో బతుకుతుంటాడు. ఒక అవినీతి పోలీస్ కమిషనర్ రషీద్ ఖాన్ కోసం కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేస్తుంటాడు.

నిద్రలేమితో బాధపడే కెన్నెడీ, తాను చంపిన వారి ఆత్మల భయంతో సతమతమవుతుంటాడు. సలీమ్ అనే వ్యక్తి కోసం వెతుకుతూ, తన పాపాలకు ప్రాయశ్చిత్తం కోరుకుంటాడు. ఈ క్రమంలో ఛార్లీ (సన్నీ లియోనీ) అనే మిస్టరీ మహిళతో అతని ప్రయాణం, ముంబై చీకటి కోణాలు, రాజకీయ నాయకులు-నేరస్తుల మధ్య సంబంధాలను ఈ సినిమాలో చూపించారు. కొవిడ్ మహమ్మారి సమయంలోని ముంబైలో ఐదు రాత్రుల పాటు సాగే కథ ఇది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe