ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అర్దరాత్రి హత్యలు.. లీడ్ రోల్లో సముద్రఖని

ఓటీటీలోకి మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ నటుడు సముద్రఖని లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (జనవరి 30) అనౌన్స్ చేశారు. జీ5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jan 30, 2026, 16:04:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ వెబ్ సిరీస్ ‘తడయం’ (Thadayam). ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గతేడాది రేఖై, హార్టిలీ బ్యాటరీ, వేడువన్‌ వంటి సిరీస్‌లను అందించిన జీ5.. ఈ ఏడాది ‘తడయం’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అర్ధరాత్రి హత్యలు చేసే కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి సాగే వేట చుట్టూ తిరిగే కథ ఇది.

ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అర్దరాత్రి హత్యలు.. లీడ్ రోల్లో సముద్రఖని
ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అర్దరాత్రి హత్యలు.. లీడ్ రోల్లో సముద్రఖని

తడయం ఓటీటీ రిలీజ్ డేట్

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సముద్రఖని పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందే ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా శుక్రవారం (జనవరి 30) స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. సముద్రఖనిలాంటి నటుడితో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.

తడయం వెబ్ సిరీస్ స్టోరీ ఇదీ

ఈ తడయం వెబ్ సిరీస్ 1999 నాటి కాలంలో జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుల్లో అర్ధరాత్రి వేళల్లో జరిగే వరుస హత్యలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఈ హత్యలను ఛేదించడానికి వచ్చిన ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ (సముద్రఖని) ఒక భయంకరమైన విషయాన్ని గుర్తిస్తాడు. హంతకుడు కేవలం వివాహిత స్త్రీల దగ్గర ఉన్న మాంగళ్యం/తాళి మాత్రమే దొంగిలిస్తుంటాడు. ఈ విచిత్రమైన, క్రూరమైన హంతకుడిని పట్టుకునేందుకు సాగే వేట ఈ వెబ్ సిరీస్ కథాంశం.

ఈ తడయం వెబ్ సిరీస్ ను అజయ్ కృష్ణ నిర్మించాడు. నవీన్ కుమార్ పళనివేల్ డైరెక్ట్ చేశాడు. మూడేళ్ల కిందట కూడా ఇదే పేరుతో మరో వెబ్ సిరీస్ రావడం విశేషం. ఇప్పుడీ తాజా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఇటీవలే విక్రమ్ ప్రభు నటించిన ‘సిరై’ (Sirai) సినిమా కూడా జీ5లో విడుదలైంది. అలాగే శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ (Parasakthi) ఫిబ్రవరి 7న ఇదే ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More