OTT Crime Thriller: ఆటో డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, మద్రాస్ క్రైమ్ రాజ్యాన్ని శాసించిన రియల్ సైకో కిల్లర్ కథే 'ఆటో శంకర్' (Auto Shankar). 1980ల నాటి భయానక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 (ZEE5) ఓటీటీలో దుమ్మురేపుతోంది.
ఆటో శంకర్.. అసలు కథేంటి? ఒక ఆటో డ్రైవర్ డాన్‌గా ఎలా మారాడు?

ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అందులోనూ రియల్ సైకో కిల్లర్ స్టోరీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే జీ5 ఓటీటీలో ఉన్న ఈ ఆటో శంకర్ వెబ్ సిరీస్. అసలు ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.
పగటిపూట సాదాసీదా ఆటో నడిపే శంకర్ (అప్పాని శరత్), రాత్రి వేళల్లో సారా స్మగ్లింగ్ చేసేవాడు. ఆ క్రమంలో స్థానికంగా తనకు ఎదురొచ్చిన వాళ్లను తొక్కేస్తూ తన నేర సామ్రాజ్యాన్ని ఊహించని రేంజ్‌లో విస్తరించాడు.
అక్రమ రవాణా, బెదిరింపులు, వ్యభిచార గృహాల నిర్వహణతో పాటు రాజకీయ నాయకులు, కొందరు అవినీతి పోలీస్ ఆఫీసర్ల సపోర్ట్‌తో చెన్నై నగరంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. తన దారికి అడ్డువచ్చిన వారిని అతి దారుణంగా నరికి చంపేసేవాడు.
ఈ క్రమంలో శంకర్ చేసిన వరుస క్రూరమైన హత్యలు నగరంలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత పోలీసులు శంకర్‌ను పట్టుకోవడానికి వేసిన స్పెషల్ స్కెచ్, జైలు నుంచి అతను పారిపోయేందుకు చేసిన ప్లాన్స్, చివరకు అతనికి విధించిన ఉరిశిక్ష ఈ సిరీస్‌ను నెక్ట్స్ లెవల్‌లో నిలబెట్టాయి.
'అంగమాలి డైరీస్' ఫేమ్ అప్పాని శరత్ నటన కేక
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ హీరో అప్పాని శరత్ యాక్టింగ్. మలయాళంలో 'అంగమాలి డైరీస్', తమిళంలో 'సందకోళి 2' లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శరత్.. ఈ ఆటో శంకర్ క్యారెక్టర్లో జీవించేశాడు.
{{/usCountry}}ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ హీరో అప్పాని శరత్ యాక్టింగ్. మలయాళంలో 'అంగమాలి డైరీస్', తమిళంలో 'సందకోళి 2' లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శరత్.. ఈ ఆటో శంకర్ క్యారెక్టర్లో జీవించేశాడు.
{{/usCountry}}అతని కళ్లలో కనిపించే వైలెంట్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. రంగా యల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కి సౌండ్ డిజైన్, డార్క్ సినిమాటోగ్రఫీ డ్రెడ్‌ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి.
తెలుగులోనూ స్ట్రీమింగ్.. 10 ఎపిసోడ్లు
మొత్తం 10 ఎపిసోడ్లు ఉండే ఈ వెబ్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో సాగుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ను సీటు అంచున కూర్చోబెడతాయి.
ఐఎండీబీ (IMDb)లో ఈ వెబ్ సిరీస్‌కు 6.7/10 రేటింగ్ లభించింది. మూల కథ తమిళంలో తెరకెక్కినప్పటికీ, జీ5 ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో డబ్బింగ్ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్ క్రైమ్ స్టోరీస్, డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే క్రైమ్ ఫిక్షన్ ప్రియులకు 'ఆటో శంకర్' ఒక పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్. వీకెండ్‌లో మైండ్ షేక్ చేసే క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే జీ5లో ఈ సిరీస్‌పై ఒక లుక్కేసేయండి.