Crime Thriller Web Series: లగ్జరీ కార్లు దొంగిలించే నలుగురు ఫ్రెండ్స్ ముఠా.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
Crime Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే.. ఇది లగ్జరీ కార్లను చోరీ చేసే నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.
Crime Thriller Web Series: ఓటీటీ ప్రియులను మునివేళ్ల మీద నిలబెట్టే సరికొత్త హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. 2000వ దశకం ప్రారంభంలోని ముంబై నగర నేపథ్యంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar) అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఒక గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. యువతను ఆకట్టుకునే నటీనటులతో పాటు సీనియర్ నటుల అద్భుతమైన కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చార్ యార్ వెబ్ సిరీస్ విశేషాలు
వెబ్ సిరీస్ టైటిల్ : Chaar Yaar (చార్ యార్)
ఓటీటీ : Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో)
రిలీజ్ డేట్ : అక్టోబర్ 23, 2026
ఎపిసోడ్లు : 8
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు : పూరవ్ ఝా, నమన్ జైన్, సాఖిబ్ ఆయుబ్, ప్రయ్రాక్ మెహతా, సయీ తమహంకర్, సికందర్ ఖేర్, చుంకీ పాండే
నలుగురు స్నేహితుల కథ, అండర్ వరల్డ్ ఉచ్చు
ఈ చార్ యార్ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. 2000 ప్రారంభంలో ముంబై నేపథ్యంలో నలుగురు మధ్యతరగతి యువకుడు, స్నేహితులు అయిన జయ్, టోనీ, సాహిల్, సమీర్ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మెరుగైన భవిష్యత్తును సాధించాలనే కోరిక, కుటుంబ బాధ్యతల ఒత్తిడి మధ్య నలిగిపోయే ఈ నలుగురు యువకులు.. జీవితంలో ఒకే ఒక్క చిన్న కారుతో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వారు తీసుకునే ఒకే ఒక్క తప్పుడు, ప్రమాదకరమైన నిర్ణయం వారిని ముంబై అండర్ వరల్డ్, నేర సామ్రాజ్యంలోకి నడిపిస్తుంది.
సరదాగా తిరుగుతూ కార్లు చోరీ చేసే యువకులుగా ఉన్న వీరు నేర ప్రపంచంలో ఎలా ఎదిగారు? ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ క్రైమ్ డ్రామాను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
చార్ యార్ ట్రైలర్ ఎలా ఉందంటే?
తాజాగా ఈ చార్ యార్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కార్లు చోరీ చేయడంలో నైపుణ్యం సాధించిన నలుగురు యువకులు.. ఆ తర్వాత ముంబై అండర్ వరల్డ్ డాన్ తో చేతులు కలపడం చూడొచ్చు. అయితే ఆ నిర్ణయమే వాళ్ల జీవితాలను మార్చేస్తుంది.
ఈ వెబ్ సిరీస్‌లో పూరవ్ ఝా, నమన్ జైన్, సాకిబ్ అయూబ్, ప్రయాక్ మెహతా ప్రధాన పాత్రల్లో నటిస్తూ తమ సహజమైన నటనతో ఆకట్టుకోనున్నారు. వీరితో పాటు సయీ తమహంకర్, సిందర్ ఖేర్, దిబ్యేందు భట్టాచార్య, రాజేష్ తైలంగ్, చుంకీ పాండే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించి సిరీస్ స్థాయిని పెంచారు.
2000 నాటి ముంబై వాతావరణాన్ని, అండర్ వరల్డ్ సెటప్‌ను రియలిస్టిక్‌గా చూపించిన సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కు అక్టోబర్ 23 నుంచి పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


