OTT Crime Thriller: ఓటీటీలోకి రోజా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వ్యవస్థపై సంచలన సినిమా.. 9 రేటింగ్

OTT Crime Thriller: ఓటీటీలోకి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లెనిన్ పాండియన్ స్ట్రీమింగ్ కు వస్తోంది. మరికొన్ని గంటల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఐఎండీబీలో 9 రేటింగ్ ఉండటానికి కారణమేంటో చూడండి.

Published on: Oct 15, 2026, 20:27:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller: ఓటీటీలో ఈవారం వచ్చిన, వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ల సినిమాల జాబితాలో మరో మూవీ చేరింది. తెలుగు నటి రోజా నటించిన తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లెనిన్ పాండియన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి అంటే అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇసుక మాఫియా, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్, ఓ రైతు చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

OTT Crime Thriller: ఓటీటీలోకి రోజా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వ్యవస్థపై సంచలన సినిమా.. 9 రేటింగ్
OTT Crime Thriller: ఓటీటీలోకి రోజా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వ్యవస్థపై సంచలన సినిమా.. 9 రేటింగ్

లెనిన్ పాండియన్ మూవీ స్టోరీ ఇలా

పోలీస్ వ్యవస్థలో జరిగే అణచివేత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే అరాచకాలు, సామాన్యుల జీవితాలపై జరిగే దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపే మరో ప్రయత్నమే 'లెనిన్ పాండియన్' (Lenin Pandiyan). డీడీ బాలచంద్రన్ (DD Balachandran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషల్ క్రైమ్ డ్రామా మూవీలో నటీనటుల సహజమైన నటన, బలమైన కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన వ్యవస్థే కొందరి చేతుల్లో కీలుబొమ్మగా ఎలా మారుతుందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, దాని చుట్టూ తిరిగే రాజకీయాలు, ఒక సామాన్య కానిస్టేబుల్ ఫైట్, వృద్ధ రైతు జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపాయనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు నెల రోజుల్లోపే ప్రైమ్ వీడియోలోకి వస్తోంది.

ఎవరెలా చేశారంటే?

ఈ లెనిన్ పాండియన్ మూవీలో శిక్షణ పొందిన యువ కానిస్టేబుల్ మారవర్మన్ సుందరపాండియన్‌గా దర్శన్ గణేశన్ (Dhaarshan Ganesan) మంచి డెబ్యూ ఇచ్చారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, ఎంతో రియలిస్టిక్‌గా ఉండే ఈ పాత్రలో దర్శన్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సెన్సిటివ్ సీన్లలో ఆయన పరిణతి ప్రదర్శించారు.

ఇక సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచిన నటుడు జార్జ్ మరియన్. జడ్జ్ భీమారావు పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. సామాజిక అసమానతలపై ఆయన చెప్పే డైలాగులు, నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.

మరోవైపు గంగై అమరన్, రోజా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కాస్త ఉద్వేగాన్ని, నవ్వులను పంచుతాయి. అయితే కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగా సింక్ కాకపోవడం చిన్న మైనస్‌గా అనిపిస్తుంది. అలాగే ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్‌లో ఇళయరాజా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

మైనస్‌లూ ఉన్నాయ్

దర్శకుడు డీడీ బాలచంద్రన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటూ చాలా వరకు రియలిస్టిక్ అప్రోచ్‌ను ఫాలో అయ్యారు. కథనం పరంగా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు ముందే ఊహించేలా ఉంటాయి.

క్లైమాక్స్ ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. అయినప్పటికీ దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దానికి తగ్గట్టుగా రాసుకున్న సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ఈ సంచలన డ్రామాను సినిమా ప్రేమికులు కచ్చితంగా చూడాల్సిందే. కమర్షియల్ హంగులకు దూరంగా నిజాయితీతో కూడిన కథాంశాన్ని ఇష్టపడేవారికి 'లెనిన్ పాండియన్' ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More