Raakh Villains: జనాలు అంతలా అసహ్యించుకున్నారు.. దేశాన్ని వణికించారు.. కట్ చేస్తే రాఖ్ విలన్లకు కెరీర్ బెస్ట్ అవార్డులు
Raakh Villains: ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాఖ్ (Raakh)లో విలన్లు నటించిన ఆకాశ్ మఖీజా, రమణ్‌దీప్ యాదవ్ లకు కెరీర్ బెస్ట్ అవార్డులు దక్కాయి. జనాలు వీళ్లను ఎంతో అసహ్యించుకున్నారు.. దేశమే వీళ్ల క్రూరమైన నటనకు ఫిదా అయిపోయింది. ఇప్పుడందుకు ప్రతిఫలం దక్కింది.
Raakh Villains: ప్రైమ్ వీడియోలో రీసెంట్‌గా రిలీజైన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతోంది. ఈ సిరీస్‌లో విలన్లుగా నటించిన ఆకాష్ మఖీజా, రమణ్‌దీప్ యాదవ్ తమ పెర్ఫార్మెన్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని అందుకున్నారు. ఆడియన్స్ వీళ్లను దారుణంగా అసహ్యించుకున్నారు. వారు పోషించిన బాబు, రజ్జో క్యారెక్టర్లపై జనాల్లో వచ్చిన ఈ రేంజ్ ద్వేషమే ఇప్పుడు వారి కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

ఈ ఇద్దరు యాక్టర్స్ ఊహించని విధంగా దేశంలోనే మోస్ట్ పాపులర్ నటులుగా అవతరించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. బుధవారం (జూన్ 24) ఐఎండీబీ (IMDb) వీరికి ప్రతిష్టాత్మకమైన ‘బ్రేక్‌అవుట్ స్టార్’ స్టార్‌మీటర్ అవార్డులను (IMDb Breakout Star STARmeter Awards) అనౌన్స్ చేసింది.
ఐఎండీబీ చార్ట్స్‌లో టాప్ ప్లేస్.. 13 ఏళ్ల నిరీక్షణకు దక్కిన గౌరవం
ఐఎండీబీ యాప్‌లో పబ్లిష్ అయ్యే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి ఈ అవార్డు దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ వెబ్‌సైట్‌ను విజిట్ చేసే 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. రాఖ్ వెబ్ సిరీస్ రిలీజైన ఫస్ట్ వీక్‌లోనే ఆకాష్ మఖీజా నంబర్ 1 ప్లేస్ సాధించగా, రమణ్‌దీప్ యాదవ్ నంబర్ 4 ప్లేస్‌లో నిలిచారు.
"నా 13 ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌లో నాకు దక్కిన ఫస్ట్ అవార్డు ఈ ఐఎండీబీ బ్రేక్‌అవుట్ స్టార్. నా ఇన్‌స్టాగ్రామ్ డీఎంలు మొత్తం నెటిజన్ల తిట్లు, ద్వేషంతో నిండిపోయాయి. నా క్యారెక్టర్‌ను అంతలా అసహ్యించుకుని, నాకు ఈ అవార్డు వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్" అని ఆకాష్ మఖీజా ఎమోషనల్ అయ్యారు.
మొదట్లో ఈ బాబు క్యారెక్టర్ కోసం తనను రిజెక్ట్ చేశారని, కానీ లక్కీగా మరో రౌండ్ ఆడిషన్స్ కాల్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చానని ఆకాష్ ఈ సందర్భంగా రివీల్ చేశారు.
సీరియల్ కిల్లర్స్ కళ్లపై రీసెర్చ్.. స్క్రిప్ట్ చదివి ఏడ్చేసిన రమణ్‌దీప్
మరో విలన్ రమణ్‌దీప్ యాదవ్‌కు కూడా ఇది కెరీర్‌లో ఫస్ట్ అవార్డు కావడం విశేషం. ఆడియన్స్ సపోర్ట్ వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రజ్జో క్యారెక్టర్ కోసం తను చేసిన హోమ్‌వర్క్ గురించి చెబుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
"నేను పనిగట్టుకొని ఈ రోల్ కోసం రీసెర్చ్ చేయలేదు కానీ.. రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందనే దానిపై స్టడీ చేశాను. వారి కళ్లలో ఒక రకమైన క్రూరత్వం, భయానక వాతావరణం కనిపిస్తుంది. దాన్నే నా క్యారెక్టర్‌లో చూపించాలనుకున్నాను. మేకర్స్ ఎక్కడా మా పాత్రలను గొప్పగా చూపించలేదు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను స్క్రిప్ట్‌లో రాసిన విధానం చూసి నేను ఏడ్చేశాను" అని రమణ్‌దీప్ చెప్పుకొచ్చారు.
1978 నాటి రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ బ్యాక్‌డ్రాప్
'రాఖ్' వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఇది 1978లో న్యూ ఢిల్లీలో దేశాన్ని కుదిపేసిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు అండర్ ఏజ్ తోబుట్టువుల కిడ్నాప్, మర్డర్ కేసు ఆధారంగా తెరకెక్కింది. రియల్ లైఫ్ నేరస్థులు కుల్జీత్ సింగ్ (రంగా), జస్బీర్ సింగ్ (బిల్లా) చేసిన దారుణాలను స్పూర్తిగా తీసుకుని, డైరెక్టర్లు ప్రోసిత్ రాయ్, అనుషా నందకుమార్, సందీప్ సాకేత్ ఈ ఫిక్షనల్ నరేటివ్‌ను అద్భుతంగా రూపొందించారు.
జూన్ 12న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు హిందుస్థాన్ టైమ్స్ 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇది క్యాజువల్‌గా టైమ్‌పాస్ కోసం చూసే సిరీస్ కాదని, సమాజంలోని క్రూరత్వాన్ని ప్రశ్నించే ఒక సీరియస్ ఆర్ట్ ఫిల్మ్ లాంటిదని రివ్యూ పేర్కొంది. ఈ షోలో సోనాలి బింద్రే, అలీ ఫజల్, అమీర్ బషీర్, రాకేష్ బేడీ, అన్షుల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డార్క్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే ఓటీటీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడని కంటెంట్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


