Crime Thriller Web Series: ఒక మర్డర్ మిస్టరీ కేస్ క్లోజ్ అయిన తర్వాత అసలైన విచారణ మొదలైతే ఎలా ఉంటుంది? ఓటీటీ ప్రియులను ఊపేసిన మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వదంతి' (Vadhandhi) సీజన్ 2 తో మళ్లీ మన ముందుకు వచ్చేస్తోంది. 'వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి' (Vadhandhi Season Two: The Mystery of Mani) పేరుతో తెరకెక్కించిన ఈ సీట్ ఎడ్జ్ డ్రామా ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్

తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. పవర్‌ఫుల్ యాక్టర్ ఎమ్. శశికుమార్ ఇందులో ఎస్ఐ మూసా రజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
"కేస్ క్లోజ్ అయిన తర్వాతే అసలైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది" అని ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మదురై జల్లికట్టు బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ డ్రామా
మదురై బ్యాక్‌డ్రాప్‌లో సాంప్రదాయ జల్లికట్టు పండుగ వాతావరణంలో ఈ సీజన్ కథ సాగుతుంది. ఒక నేషనల్ హైవే నిర్మాణం కోసం నేలను తవ్వుతున్న సమయంలో ఒక పాత అస్థిపంజరం బయటపడటంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
పొలిటికల్ ప్రెజర్, మీడియా హంగామా మధ్యలో ఆ నిజమైన నేరస్థుడిని పట్టుకోవడానికి ఎస్ఐ మూసా రజా చేసే విచారణే ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణ. పదేళ్ల క్రితం నాటి ఆ రహస్య అస్థిపంజరం మిస్టరీ చివరికి 'మణి' అనే ఖైదీ దగ్గరికి ఎలా తీసుకెళ్లిందో దర్శకుడు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో తీర్చిదిద్దారు.
ఎస్.జే. సూర్య మొదటి సీజన్ నుంచి శశికుమార్ వరకు..
2022లో ఎస్.జే. సూర్య హీరోగా వచ్చిన 'వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' మొదటి సీజన్ ఓటీటీలో సంచలన విజయం సాధించింది. 'విక్రమ్ వేద' ఫేమ్ పుష్కర్ - గాయత్రి తమ హోమ్ బ్యానర్ వాల్వాచర్ ఫిల్మ్స్‌పై నిర్మించిన ఈ ఫ్రాంచైజ్‌కు ఆండ్రూ లూయిస్ (Andrew Louis) క్రియేటర్, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}2022లో ఎస్.జే. సూర్య హీరోగా వచ్చిన 'వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' మొదటి సీజన్ ఓటీటీలో సంచలన విజయం సాధించింది. 'విక్రమ్ వేద' ఫేమ్ పుష్కర్ - గాయత్రి తమ హోమ్ బ్యానర్ వాల్వాచర్ ఫిల్మ్స్‌పై నిర్మించిన ఈ ఫ్రాంచైజ్‌కు ఆండ్రూ లూయిస్ (Andrew Louis) క్రియేటర్, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}వదంతులు, నిజాల మధ్య ఉన్న గీతను సస్పెన్స్‌తో బ్లర్ చేస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంలో ఈ మేకర్స్ సిద్ధహస్తులు. ఈ రెండో సీజన్‌లో అపర్ణా దాస్, అనఘ, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ, యశ్వంత్ కీలక పాత్రల్లో నటించారు.
సౌత్ ఇండియా నుంచి వస్తున్న ఇంటెన్స్ యాక్షన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌లకు నేషనల్ లెవెల్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆగస్టు 7న ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ వీక్షకులకు మరో సరికొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.