ఇవాళ ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ఫిక్షనల్ థ్రిల్లర్.. 3 లక్షల కోట్ల క్రిప్టో మోసం.. ప్రపంచానికి షాక్ ఇచ్చిన ఘటన

ఇవాళ ఓటీటీలోకి ఓ ఫిక్షనల్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఇది రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కింది. ఈ ఘటన ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 3, 2025, 12:20:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం కూడా డిఫరెంట్ జోనర్లు, భాషల సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఓ కొరియన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన క్రిప్టో కరెన్సీ క్రాష్ కథతో తెరకెక్కిన ‘క్రిప్టో మ్యాన్’ మూవీ బుధవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలో ఫిక్షనల్ థ్రిల్లర్
ఓటీటీలో ఫిక్షనల్ థ్రిల్లర్

క్రిప్టో మ్యాన్ ఓటీటీ

కొరియన్ సూపర్ హిట్ మూవీ క్రిప్టో మ్యాన్ ఇవాళ (డిసెంబర్ 3) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. కొరియన్ భాషతో పాటు తమిళం, తెలుగు, హిందీలోనూ క్రిప్టో మ్యాన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. కానీ కేవలం సౌత్ కొరియాలోనే అందుబాటులో ఉంది.

క్రిప్టో మోసాలపై

క్రిప్టో కరెన్సీ మోసాల ఆధారంగా క్రిప్టో మ్యాన్ మూవీ తెరకెక్కింది. ఇది జనవరి 15, 2025న రిలీజైంది. దీనికి హ్యూన్ హే రి డైరెక్టర్. ఈ సినిమాలో సాంగ్ జే రిమ్, ఆన్ వూ యోన్, మిన్ సుంగ్ వూక్, సో హీ జంగ్, చా జంగ్ వోన్ తదితరులు నటించారు. ఇది ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

రియల్ ఇన్సిడెంట్

నిజ జీవిత ఘటనల ఆధారంగా క్రిప్టో మ్యాన్ తెరకెక్కింది. కొరియాలో సుమారు రూ.3 లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో యాంగ్ డో హ్యున్ అనే యువకుడు ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ల్లోని లోపాలను గుర్తిస్తాడు. తన ఫ్రెండ్ జీ వూతో కలిసి ఓ స్టార్టప్ గ్రాంట్ ను పొందుతాడు.

క్రిప్టో కరెన్సీ వెంచర్ ను యాంగ్ డో ప్రారంభిస్తాడు. మమ్మీ కాయిన్ అనే వర్చువల్ కరెన్సీని డెవలప్ చేస్తాడు. దీంతో అత్యధిక లాభాలు పొందుతాడు. డబ్బుపై ఆశతో ఇతర మార్గాల్లోనూ సంపాదిస్తాడు. అయితే ఈ కాయిన్ వెంచర్ పై డౌట్ వస్తుంది. ఇన్ కమ్ డిపార్ట్ మెంట్ ఫోకస్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా మమ్మీ కాయిన్ కరెన్సీ క్రాష్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కరెన్సీ సంగతి ఏంటీ? అన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More