Dacoit OTT: ప్రేయసిపై రివేంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ థ్రిల్లర్
Dacoit OTT: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచే డెకాయిట్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ ఓటీటీ డెబ్యూ వివరాలపై ఓ లుక్కేయండి.
Dacoit OTT: ఓటీటీ ఆడియన్స్ కు మరింత కిక్ అందించేందుకు కొత్త ఫ్రైడ్ వచ్చింది. శుక్రవారం వస్తూనే ఓటీటీలో కొత్త సినిమాలను తీసుకొచ్చింది. రీసెంట్ తెలుగు రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఈ రోజే (మే 8) ఓటీటీలోకి వచ్చేసింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఓటీటీ డెబ్యూ చేసింది.

డెకాయిట్ ఓటీటీ
తెలుగు లేటెస్ట్ రొమాంటిక్ రివేంజ్ డ్రామా ‘డెకాయిట్’ ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ నుంచే డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి డెకాయిట్ వచ్చేసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో డెకాయిట్ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్
ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో రిలీజైన డెకాయిట్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, సునీల్, అతుల్ కులకర్ణి, వైభవ్ తదితరులు నటించారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ అందించాడు. షానియల్ డియో డైరెక్టర్.
డెకాయిట్ మూవీ స్టోరీ
హరిదాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) లవర్స్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ, అనూహ్యంగా హరిదాస్ 13 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అందుకు కారణం తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి కావడంతో ఆమెపై హరిదాస్ పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు.
జైలు నుంచి ఎస్కేప్
ఈ క్రమంలోనే హరిదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. అందుకు రూ. 60 లక్షలు అవసరం అవుతాయి. మరోవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భాస్కర్ (వైభవ్)కు భార్యగా సరస్వతి ఉంటుంది.
అప్పుడే పాప ఆరోగ్యం కోసం సరస్వతికి రూ. 1 కోటి అవసరం పడుతుంది. దీంతో హరిదాస్, సరస్వతి ఇద్దరు కలిసి భారీ దొంగతనం ప్లాన్ చేస్తారు. అయితే డబ్బు కొట్టేసి జూలియట్‌ను పోలీసులకు ఇరికించాలన్నది హరిదాస్ ప్లాన్.
మరి హరిదాస్ ప్లాన్ వర్కౌట్ అయిందా? సరస్వతిపై హరికి ఉన్న పగ ఏంటీ? ఎంతో ప్రేమించిన హరిని జూలియట్ ఎందుకు జైలుకు పంపించింది? సీఐ స్వామి అలియాస్ రాంబాబు (అనురాగ్ కశ్యప్), కరుణ హాస్పిటల్స్ ఛైర్మన్ (ప్రకాష్ రాజ్), మల్లి (కామాక్షి భాస్కర్ల) పాత్రల ప్రాధాన్యత ఏంటీ? అనేది తెలుసుకోవాలంటే డెకాయిట్ చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


