Dada Movie: లార్డ్స్ బాల్కనీలో దాదా ఐకానిక్ షర్ట్‌లెస్ సెలబ్రేషన్స్.. ఫస్ట్ లుక్ చూసి గంగూలీ ఫిదా.. బెస్ట్ గిఫ్ట్ అంటూ..

Dada Movie: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న దాదా మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. గంగూలీ బర్త్ డే సందర్భంగా అతని జీవితంలో ఐకానిక్ సెలబ్రేషన్స్ అయిన లార్డ్స్ బాల్కనీకి సంబంధించిన లుక్ రావడంతో ఇది తనకు బెస్ట్ గిఫ్ట్ అని అతడు అన్నాడు.

Published on: Jul 8, 2026, 15:40:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dada Movie: సౌరవ్ గంగూలీ.. ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. ముఖ్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ గెలిచాక లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి దాదా చేసిన ఆ ఐకానిక్ సెలబ్రేషన్ మరింత ప్రత్యేకం.

Dada Movie: లార్డ్స్ బాల్కనీలో దాదా ఐకానిక్ షర్ట్‌లెస్ సెలబ్రేషన్స్.. ఫస్ట్ లుక్ చూసి గంగూలీ ఫిదా.. బెస్ట్ గిఫ్ట్ అంటూ..
Dada Movie: లార్డ్స్ బాల్కనీలో దాదా ఐకానిక్ షర్ట్‌లెస్ సెలబ్రేషన్స్.. ఫస్ట్ లుక్ చూసి గంగూలీ ఫిదా.. బెస్ట్ గిఫ్ట్ అంటూ..

సరిగ్గా అదే మూమెంట్‌ను రీక్రియేట్ చేస్తూ బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు (Rajkummar Rao) ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. టీమిండియా లెజెండరీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ (Dada) ఫస్ట్ లుక్ నెట్టింట వైబ్రేషన్స్ పుట్టిస్తోంది.

బర్త్‌డే గిఫ్ట్‌గా దాదా ఫస్ట్ లుక్

బుధవారం (జులై 8) నాడు సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ అకేషన్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ 'దాదా' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రాజ్ కుమార్ రావు అచ్చు గుద్దినట్లు గంగూలీని దించేశాడు.

షర్ట్ లెస్ గా ఇండియా జెర్సీని గాలిలో ఊపుతూ అతను ఇచ్చిన పోజు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. "హ్యాపీ బర్త్‌డే మా ప్రియమైన దాదా" అంటూ రాజ్ కుమార్ రావు తన సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను ఎమోషనల్ నోట్ తో షేర్ చేశాడు. తన టాలెంట్ తో బాలీవుడ్ లో ఒక సపరేట్ మార్క్ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ రావు, ఈ బయోపిక్ కోసం పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ పోస్టర్‌పై దాదా రియాక్షన్ ఇదే

తన బయోపిక్ ఫస్ట్ లుక్ బయటికి రాగానే గంగూలీ కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. పోస్టర్ రిలీజైన కొన్ని నిమిషాలకే తన ఎక్స్ అకౌంట్‌లో దాన్ని రీపోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్.. నా ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్‌ను నువ్వు స్క్రీన్ మీద ఎలా ఆడుతావో చూడాలని వెయిట్ చేయలేకపోతున్నా" అంటూ రాజ్ కుమార్ రావుకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దాదా స్వయంగా ఈ పోస్టర్‌ను అప్రూవ్ చేయడంతో ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నాట్‌వెస్ట్ ట్రోఫీ.. ఫ్లింటాఫ్‌కు గట్టి కౌంటర్

ఈ పోస్టర్ వెనుక ఇండియన్ క్రికెట్‌ను మలుపుతిప్పిన ఒక భారీ హిస్టరీ ఉంది. 2002లో ఇంగ్లండ్ లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో 326 పరుగుల భారీ టార్గెట్‌ను యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ తమ పోరాటంతో ఛేజ్ చేసి ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించారు.

అంతకుముందు ముంబైలో సిరీస్ డ్రా అయినప్పుడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ గ్రౌండ్లో చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి కౌంటర్‌గానే దాదా లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. 18 వేలకు పైగా ఇంటర్నేషనల్ రన్స్ కొట్టిన గంగూలీ, అప్పట్లో ఫియర్ లెస్ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తో కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ పెయిర్ గా ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు.

భారీ కాన్వాస్.. బ్లాక్‌బస్టర్ మేకర్స్

ఇక ఈ సినిమా టీమ్ డీటెయిల్స్ చూస్తే కల్ట్ క్లాసిక్స్ తీసే విక్రమాదిత్య మోత్వానే దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్ స్కేల్ లో సమర్పిస్తున్నాడు.

యువ క్రికెటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇండియాకు వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా దాదా ఎలా ఎదిగాడనే జర్నీని ఇందులో విజువల్ వండర్ గా చూపించబోతున్నారు. రీసెంట్ గా కళ్ళులేని పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ తో హిట్ కొట్టిన రాజ్ కుమార్ రావు, ఇప్పుడు గంగూలీ క్యారెక్టర్ కోసం తన మేకోవర్ తో మైండ్ బ్లాంక్ చేశాడు. ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా మే 14, 2027న థియేటర్లలోకి రాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More