Ganguly Biopic: గంగూలీ బయోపిక్.. ఈడెన్ గార్డెన్స్‌లో షూటింగ్.. అచ్చూ దాదాలా రాజ్‌కుమార్ రావ్.. ఫొటోలు వైరల్
Ganguly Biopic: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ మొదలైంది. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ ఫొటోల్లో అచ్చూ దాదాలా మారిపోయిన నటుడు రాజ్‌కుమార్ రావును చూడొచ్చు.
Ganguly Biopic: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ (Dada: The Sourav Ganguly Story) షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కోల్‌కతాలో కీలకమైన 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.

గంగూలీ ఇల్లు, ఈడెన్ గార్డెన్స్‌లో షూటింగ్
ఈ బయోపిక్‌కు పక్కా నేటివిటీ, ప్రామాణికత తీసుకురావడానికి చిత్ర బృందం కోల్‌కతాలోని నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతోంది. బెహలా సందుల నుండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల వరకు ‘దాదా’ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.
గంగూలీ పుట్టి పెరిగిన బెహలాలోని ఆయన సొంత నివాసంలోనే మంగళవారం (మే 26) తెల్లవారుజామున షూటింగ్ ప్రారంభమైంది. గంగూలీ ఆర్యన్ క్లబ్ తరఫున ఆడిన రోజులను రీక్రియేట్ చేయడానికి కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈస్ట్ బెంగాల్ క్లబ్ గ్రౌండ్స్‌లో కొన్ని సీన్లను చిత్రీకరించారు.
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ముగిసిన వెంటనే, ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఈ షూటింగ్ సమయంలో సౌరవ్ గంగూలీ స్వయంగా సెట్స్‌కు వచ్చి చిత్ర బృందంతో కాసేపు సమయం గడిపారు.
‘దాదా’ మూవీ విశేషాలు
ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే (Vikramaditya Motwane) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. బెంగాలీ నేపథ్యం ఉన్న కథ కావడంతో అక్కడి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటులను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. ఈ మూవీలో గంగూలీగా రాజ్ కుమార్ రావు, అతని భార్య డోనా గంగూలీ పాత్రలో తాన్య నటిస్తున్నారు. మ్యూజిక్ ను ప్రీతమ్ అందిస్తున్నాడు.
సుశాంత్ సింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?
ఎక్స్ లో ఈ సినిమా సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. గతంలో ‘ఎమ్మెస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ బయోపిక్‌తో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు గంగూలీ బయోపిక్‌తో రాజ్‌కుమార్ రావు కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్‌తో మెప్పించగలరా లేదా అని క్రికెట్, సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజ్‌కుమార్ రావు కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘టోస్టర్’ (Toaster) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకుముందు ఆయన మాలిక్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ చుక్ మాఫ్ వంటి చిత్రాల్లో కనిపించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సౌరవ్ గంగూలీ బయోపిక్ పేరు ఏంటి, అందులో హీరో ఎవరు?
ఈ బయోపిక్ పేరు ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు పోషిస్తున్నారు.
2. దాదా సినిమాకు దర్శకత్వం వహిస్తుంది ఎవరు?
ఈ చిత్రానికి ప్రసిద్ధ హాలీవుడ్/బాలీవుడ్ మేకర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్ నిర్మిస్తున్నారు.
3. కోల్‌కతాలో ఏయే లొకేషన్లలో షూటింగ్ జరుపుతున్నారు?
బెహలాలోని గంగూలీ సొంత ఇల్లు, ఈస్ట్ బెంగాల్ క్లబ్ గ్రౌండ్స్, చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


